మందుబాబులకు ఏపీ సర్కారు షాక్: ఇతర రాష్ట్రాల నుంచి ఒక్క లిక్కర్ బాటిల్ కూడా తెచ్చేందుకు అనుమతి లేదు!
AP Govt:మద్యం అమ్మకాలు, అక్రమ రవాణా పై రాష్ట్ర సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఇతర రాష్ట్రాల నుంచి ఒక్క బాటిల్ కూడా తీసుకురావడానికి వీల్లేదని స్పష్టం చేసింది.
మద్యం అమ్మకాలు, అక్రమ రవాణా పై రాష్ట్ర సర్కారు(AP Govt) కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలు కొందరి పాలిట శాపంగా మారుతున్నాయి. తెలంగాణ(Telangana) నుంచి ఏపీకి అక్రమంగా మద్యాన్ని తరలిస్తూ అడ్డంగా దొరికిపోయిన వారిపై ఏపీ పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు.
కొందరిపై పోలీసులు వేధింపులకు పాల్పడటం వల్ల..బాధితులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇటీవల గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాల్లో జరిగిన ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. గతంలో ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి ఏపీకి లిక్కర్(Liquor) తీసుకురావడానికి మూడు సీసాలకు అనుమతి ఉండేది. అయితే అక్రమ మద్యం కేసును ఎదుర్కొన్న ఓ వ్యక్తి హైకోర్టు(high court)ను ఆశ్రయించడంతో కోర్టు బాధితుడికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. మూడు బాటిళ్లకు అనుమతి ఉన్నా అక్రమ మద్యం కేసు ఎందుకు నమోదు చేశారని ప్రశ్నించింది. దీంతో అప్పటి నుంచి గతంలో ఉన్న పాత జీవోను ఏపీ ప్రభుత్వం(AP Govt) సవరించింది.
Also Read:ఏపీలో రానున్న రెండ్రోజుల్లో వర్షాలు, 16వ తేదీన అల్పపీడనం
గతంలో మూడు బాటిళ్ల వరకు అనుమతి ఉన్నా, కొందరు దాన్ని దుర్వినియోగం చేశారని, అందుకే ఏపీ ప్రభుత్వం పాత జీవోలో సవరణలు చేసిందని ఎక్సైజ్ అధికారులు(Excise officials) స్పష్టం చేశారు. ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి కానీ విదేశాల నుంచి కానీ ఒక్క బాటిల్ కూడా తీసుకు రావడానికి వీల్లేదని అంటున్నారు. ముందస్తు అనుమతి తీసుకుని, పన్నులు చెల్లించి తర్వాత మాత్రమే ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి రెండు లీటర్ల మద్యం తీసుకు రావడానికి అనుమతి ఉందంటున్నారు ఎక్సైజ్ అధికారులు.
ఏపీ ప్రభుత్వం తెచ్చిన కొత్త జీవో(GO)పై వివాదం మెుదలైంది. ఇతర రాష్ట్రాల మాదిరిగానే ఇక్కడ కూడా కొంత సడలింపు ఇస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ఏపీ ప్రభుత్వం పునరాలోచించడంతో పాటు బాధితులను వేధిస్తున్న పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook