Viral News: శ్రీశైలం ఘాట్‌లో పెద్దపులి హల్ చల్ చేసింది. శుక్రవారం ఉదయం  రోడ్డు దాటుతూ ప్రయాణీకుల కంట పడింది.  ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల-శ్రీశైలం ఘాట్‌ రహదారిలో చింతల చెంచు గిరిజనగూడెం సమీపంలో పెద్దపులి(Big Tiger) తారసపడినట్లు వాహనదారులు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అవి కాస్తా వైరల్ గా మారాయి. పెద్దపులిని చూసి వాహనదారులంతా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వెహికల్స్ ను చూసిన పులి భయంతో రోడ్డుపై కొంతదూరం పరిగెత్తి అడవిలోకి పారిపోయింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పెద్దపులి సమాచారాన్ని తెలుసుకున్న దోర్నాల అటవీ క్షేత్రాధికారి విశ్వేశ్వరరావు సిబ్బందితో వెళ్లి ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. అడుగులను బట్టి దానిని ఆడపులిగా గుర్తించారు. ఇది దగ్గర్లోని పెద్దచామ ప్రాంతంలో సంచరిస్తోందని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ ప్రాంతం టైగర్ రిజర్వు ఫారెస్ట్‌ కిందకు వస్తుందన్నారు. గతేడాది కూడా ఇదే సీజన్లో  శ్రీశైలం సమీపంలోని సాక్షిగణపతి ఆలయం వద్ద పెద్దపులి యాత్రికులకు కనిపించింది. పులులు తరుచూ ప్రజల కంట పడటం నల్లమలలో టైగర్స్ జనాభా పెరిగిందనే వాదనకు బలం చేకూరుస్తోంది. 


నల్లమల అటవీ ప్రాంతంలో పులుల సంఖ్య పెరుగుతోంది. అమ్రాబాద్ టైగర్ రిజర్వులో గతంలో 12 ఉంటే తాజాగా వాటి సంఖ్య 21కి పెరిగింది. అమ్రాబాద్ రిజర్వులో సంతానోత్పత్తికి అనుకూలంగా ఉన్న ఆడ పులుల సంఖ్య గతంతో పోలిస్తే పెరిగింది.  పులుల సంతతిని పెంచేందుకు ఫారెస్ట్ అధికారులు చేపడుతున్న చర్యలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి. 


Also read: King Cobra Python Viral Video: గెలికి మరీ ప్రాణాల మీదికి తెచ్చుకున్న కింగ్ కోబ్రా.. కొండచిలువ పట్టు మాములుగా లేదుగా!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి