Somu Veerraju Comments: ఆంధ్రప్రదేశ్‌లో పొత్తుల అంశంపై జోరుగా చర్చ జరుగుతోంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ వ్యాఖ్యలతో కూటమి ఏర్పాటుపై క్లారిటీ వస్తోంది. రాబోయే ఎన్నికల్లో 2014 జోడీనే రిపీట్ అవుతుందన్న ప్రచారం జరుగుతోంది. ఈనేపథ్యంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు హాట్ కామెంట్స్ చేశారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పొత్తుల విషయంలో తాము స్పష్టంగా ఉన్నామని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు స్పష్టం చేశారు. జనసేనతో పొత్తు కొనసాగుతోందని తేల్చి చెప్పారు. టీడీపీ, జనసేన పొత్తులపై వారినే అడగాలన్నారు. ఏలూరులో మాట్లాడిన ఆయన ఈమేరకు వ్యాఖ్యలు చేశారు. పొత్తులపై నంద్యాల జిల్లాలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీనిపై సోమువీర్రాజును జర్నలిస్టులు ప్రశ్నించారు.


కుటుంబ పార్టీలతో బీజేపీ పొత్తు పెట్టుకోదని స్పష్టం చేశారు. 2014లో టీడీపీ,బీజేపీ, జనసేన పార్టీలు కలిసి పోటీ చేశాయి. 2014 ఎన్నికల్లో ఆ కూటమి ఘన విజయం సాధించింది. కేంద్ర,రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ పార్టీలు మంత్రి పదవులను పంచుకున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత నెలకొన్న పరిణామాలతో ఆ పార్టీల మధ్య దూరం పెరిగింది. దీంతో 2017లో ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు వచ్చింది.


గత ఎన్నికల్లో ఆ పార్టీలు వేర్వేరుగా పోటీ చేశాయి. టీడీపీ 20కిపైగా సీట్లు సాధించగా..జనసేన(JANASENA) ఒక స్థానంలో గెలిచింది. బీజేపీ మాత్రం ఖాతా తెరవలేకపోయింది. ఆ తర్వాత బీజేపీతో కలిసి పనిచేస్తామని జనసేన ప్రకటించింది. ఐతే జనసేనాని పవన్ కళ్యాణ్‌..టీడీపీతో కలిసి వెళ్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కమలనాథులు మాత్రం 2024 ఎన్నికలే తమ టార్గెట్ అని అంటున్నారు. ఆ దిశగా ముందుకు వెళ్తున్నారు.


Also read:NIA Raids on Dawood: దావూద్ అనుచరుల ఇళ్లపై ఎన్ఐఏ దాడులు.. ఏకకాలంలో 20 ప్రాంతాల్లో..!


Also read:Elon Musk: ఇంటర్నెట్‌ సేవలను అందిస్తే చంపేస్తారా..?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook