ఐదు కేంద్రాల్లో రీపోలింగ్‌కి సీఈఓ సిఫారసు
ఐదు కేంద్రాల్లో రీపోలింగ్‌కి సీఈఓ సిఫారసు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఐదు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాల్సిందిగా కేంద్ర ఎన్నికల సంఘానికి సిఫారసు చేస్తూ ఓ లేఖ రాసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది మీడియాకు తెలిపారు. మంగళవారం అమరావతి సచివాలయంలో ద్వివేది విలేకరులతో మాట్లాడుతూ.. గుంటూరు జిల్లాల్లో రెండు, నెల్లూరు జిల్లాల్లో రెండు, ప్రకాశం జిల్లాలో ఒక పోలింగ్ కేంద్రంలో రీపోలింగ్ కోసం సీఈసీకి సిఫారసు చేశామని చెప్పారు. ఆయా జిల్లాల కలెక్టర్లు పరిశీలించి పంపించిన నివేదికల ఆధారంగా ఈ నిర్ణయానికి వచ్చినట్లు ద్వివేది వెల్లడించారు.