chandrababu govt to give 50 percent subsidy on petrol and diesel for disabled persons: ఆంధ్ర ప్రదేశ్ లో ప్రస్తుతం కూటమి సర్కారు అధికారంలో ఉంది. ఒకవైపు ఏపీకి మరల గాడిలో పెట్టే విధంగా పాలన అందిస్తునే.. ప్రజలకు డెవలప్ మెంట్ పథకాల్ని కూడా అందేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం కొన్నిరోజులుగా పెట్రోల్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సామాన్యుడు మాత్రం రోజు రోజుకు పెరిగిపోతున్న పెట్రోల్, డీజీల్ ధరల్ని చూసి బెంబెలెత్తిపోతున్నాడు. అసలు..తన వెహికిల్ ను బైటకు తీయాలంటేనే పలు మార్లు ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఏపీ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తొంది. ఏపీలోని దివ్యాంగుకులకు.. పెట్రోల్, డీజీల్ ధరల్లో 50శాతం రాయితీ  కల్పించేదిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తొంది.


ఈ క్రమంలో దివ్యాంగులు ఈ పథకానికి అప్లై చేసుకొవాలని ఏపీ సర్కారు ఆదేశించినట్లు సమాచారం. 2024-25 ఏడాదికి సంబంధించి ఈ పథకం అమలు కోసం.. రాష్ట్రవ్యాప్తంగా ఒక్కో జిల్లాకు రూ.లక్ష చొప్పున రూ. 26 లక్షల్ని ప్రభుత్వం కేటాయించినట్లు సమాచారం. ఈ మేరకు ఈ పథకానికి సంబంధించి పలు జిల్లాల్లో అర్హత ఉన్న దివ్యాంగుల నుంచి దరఖాస్తుల్ని స్వీకరించడం కోసం సర్కారు ఒక ప్రకటన విడుదల చేసింది.


Read more: Pawan kalyan: పవన్ కళ్యాణ్‌పై కుట్ర జరిగిందా..?.. నకిలీ ఐపీఎస్ ఘటనపై హోంమంత్రి సీరియస్..


రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకం మూడు టైర్ల మోటరైజ్డ్ వాహనాలు ఉపయోగించే దివ్యాంగులకు వర్తిస్తుందని అధికారులు తెలిపారు. ఈ పథకం కింద పెట్రోలు/డీజిల్‌కు అయ్యే ఖర్చులో 50శాతం రాయితీగా రీయింబర్స్ చేస్తుంది. ఈ డబ్బుల్ని ప్రభుత్వం లబ్ధిదారుల బ్యాంకు అకౌంట్‌లలో మరల జమ చేయనున్నట్లు తెలుస్తొంది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter