CM Jagan: పోలవరం డ్యామ్‌ ద్వారా ఏ ఒక్కరికీ అన్యాయం జరగకుండా చూస్తామన్నారు సీఎం జగన్. పోలవరం నిర్వాసితులకు పరిహారం కోసం కేంద్రంపై కుస్తీ పడుతున్నామని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో బాధితులకు అన్యాయం జరగనివ్వమన్నారు. దీనిపై కేంద్రంతో పోరాడుతూనే ఉంటామని చెప్పారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో పోలవరం నిర్వాసితులతో ఆయన మాట్లాడారు. ఈసందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పోలవరం ముంపు ప్రాంతాలైన నాలుగు మండలాలతో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు. ఆర్‌ అండ్ అర్ ప్యాకేజీకి రూ.20 వేల కోట్లు అవసరమన్నారు. ఆ ప్యాకేజీ కోసం కేంద్రంతో యుద్ధం చేస్తున్నామని సీఎం జగన్ తేల్చి చెప్పారు. వెయ్యి కోట్లో, రెండు వేల కోట్లో అయితే తామే ఇచ్చేవాళ్లమని..భారీ మొత్తం ఉంది కాబట్టే కేంద్రానికి అడుగుతున్నామని తెలిపారు. పోలవరం పునరావాం అంతా కేంద్రం చేతుల్లోనే ఉందని స్పష్టం చేశారు. 


సెప్టెంబర్‌లోగా పోలవరం నిర్వాసితులకు పరిహారం అందేలా చూస్తామన్నారు సీఎం జగన్. పూర్తి పరిహారం ఇచ్చాకే పోలవరం ప్రాజెక్ట్ నింపుతామన్నారు. ఏ ఒక్కరికీ అన్యాయం జరగనీయమని చెప్పారు. నిన్నటి నుంచి వరద ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటిస్తున్నారు. వరదలతో చింతూరు ప్రాంతం ఉక్కిరిబిక్కిరి అయ్యిందన్నారు. ఇక్కడ అధికారులు తీరు అభినందనీయమని తెలిపారు. పారదర్శకంగా బాధితులందరికీ పరిహారం అందించామన్నారు.


అందరికీ రేషన్, ఇంటింటికి రూ.2 వేల తక్షణ సాయం అందించామని గుర్తు చేశారు. ఎవరికీ ఎలాంటి వరద నష్టం జరిగినా గ్రామ సచివాలయాల్లో నమోదు చేసుకోవాలని సీఎం జగన్ పిలుపునిచ్చారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ రెండు నెలల్లోగా పరిహారం అందుతుందని స్పష్టం చేశారు. ప్రతి లబ్ధిదారుడికి ఆదుకుంటామన్నారు. గుడిసెల నిర్వాసితులకు పరిహారాన్ని రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతామని వెల్లడించారు.


Also read:Corona Updates in India: దేశంలో పెరుగుతున్న రికవరీ రేటు..తాజాగా కేసులు ఎన్నంటే..!


Also read:Minister KTR: మంత్రి కేటీఆర్ వాట్సాప్‌ అకౌంట్ బ్లాక్..క్లారిటీ ఇచ్చిన సదరు సంస్థ..!



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook