జగన్ అనే నేను..!! అంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మెహన్ రెడ్డి మరోసారి ప్రమాణ స్వీకారం చేశారు.  ఏపీలో వైఎస్ఆర్సీపీ  ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పునరంకితమవుదామని ఆయన పిలుపునిచ్చారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వైసీపీ  ప్రభుత్వానికి ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా ఆయన ఇవాళ రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించారు. రైతే రాజు అని నమ్మిన ప్రభుత్వం తమదని ఈ సందర్భంగా వైఎస్ జగన్ అన్నారు. ఈ  ఏడాది కాలంగా రైతులు, కార్మికులు, మహిళలు, ప్రజల అభివృద్ధి కోసం మేనిఫెస్టోలో ఉన్న ప్రతి అంశాన్ని అమలు చేసుకుంటూ వస్తున్నామని జగన్ చెప్పారు. 


[[{"fid":"186211","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


11 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో కోట్ల మందిని కలిశానని జగన్ తెలిపారు. దాదాపు 3 వేల 648 కిలోమీటర్ల పాదయాత్రలో ప్రజల కష్టాలు తెలుసుకున్నానని చెప్పారు. అందుకు అనుగుణంగానే మేనిఫెస్టో రూపకల్పన చేశామని.. ఇప్పుడు అదే మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్ లా భావించి పాలన అందిస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 90 శాతం హామీలను నెరవేర్చామని చెప్పారు.



వైయస్ జగన్‌ అనే నేను ఆరుకోట్ల ఆంధ్రులకు ఇచ్చిన మాటను తూచ తప్పకుండా అమలు చేస్తున్నానని మరోసారి ప్రమాణం చేస్తున్నానని చెప్పారు.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..