OTS Scheme: ఓటీఎస్ లబ్ధిదారులకు సీఎం జగన్ శుభవార్త.. వారికి రూ.3 లక్షల వరకు రుణం..
CM Jagan: ఓటీఎస్ లబ్ధిదారులకు సీఎం జగన్ గుడ్ న్యూస్ చెప్పారు. రూ.20 వేలు కట్టి ఓటీఎస్ తీసుకునే లబ్ధిదారులకు బ్యాంకుల నుంచి రూ.3 లక్షల వరకు రుణం తీసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.
Andhra Pradesh news: ఓటీఎస్ పథకంపై సోమవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ (CM Jagan) సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, గృహనిర్మాణశాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, రెవెన్యూశాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంపూర్ణ గృహహక్కు పథకం లబ్ధిదారులకు (OTS Beneficiaries) బ్యాంకుల నుంచి రుణ సదుపాయం అందించే కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారు.
రూ.20వేలు కట్టి ఓటీఎస్ తీసుకోవటం ద్వారా ఎటువంటి లిటిగేషన్ లేని క్లియర్ టైటిల్ లబ్దిదారులకు వస్తుందని సీఎం జగన్ పేర్కొన్నారు. ఆ కాగితాలను బ్యాంకులో పెట్టి రూ.3 లక్షల వరకు రుణం తీసుకునే సదుపాయం ఉంటుందని తెలిపారు. దీని వల్ల లబ్దిదారులు మరింత అభివృద్ధి చెందటానికి అవకాశం ఉంటుందన్నారు. ఉచిత రిజిస్ట్రేన్, ఉచిత స్టాంప్ డ్యూటీ వల్ల రూ.1600 కోట్ల మేర పేద వర్గాలకు లాభం చేకూరిందని సీఎం అన్నారు. రుణమాఫీ ద్వారా మరో రూ.10వేల కోట్ల లబ్ధి జరిగిందని సీఎం జగన్ వెల్లడించారు.
Also Read: AP Assembly Budget Session: చంద్రబాబు లేకుండా అసెంబ్లీలో ఆ కీలకమైన బిల్లులు, రాజధాని బిల్లు కూడానా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook