CM Jagan: రాయలసీమ రైతులకు సీఎం వైఎస్ జగన్ గుడ్‌న్యూస్..!
CM Jagan: రాయలసీమ జిల్లాల్లో సీఎం జగన్ పర్యటించారు. ఈసందర్భంగా సీమ రైతులకు పలు వరాలు కురిపించారు. ఈ వివరాలు ఇప్పుడు చూద్దాం..
CM Jagan: రాయలసీమ రైతులకు సీఎం జగన్ గుడ్ న్యూస్ చెప్పారు. రైతులు ఒప్పుకుంటే ఎకరానికి రూ.30 వేలు లీజు చెల్లించేలా సోలార్ కంపెనీలతో ఒప్పందం చేసుకుంటామన్నారు. నంద్యాల జిల్లా కొలిమిగుంట్ల మండలం కలవటాల వద్ద రామ్‌కో సిమెంట్స్ పరిశ్రమను ప్రారంభించారు. ఈసందర్భంగా సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వమే ఈ భూములు లీజుకు తీసుకుని కంపెనీలకు ఇస్తుందని స్పష్టం చేశారు.
ఏటా ఐదు శాతం లీజు పెంచుతామన్నారు. ఈప్రతిపాదనలకు రైతులను ఒప్పించేలా ప్రజాప్రతినిధులు చూడాలని పిలుపుఇచ్చారు. గ్రీన్ కో ప్రాజెక్ట్‌లకు రైతులు సహకరించాలన్నారు సీఎం జగన్. రాష్ట్రంలోని పరిశ్రమలకు అన్ని విధాలా ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. పారిశ్రామిక వృద్ధికి సర్కార్ చేయూతనిస్తోందని చెప్పారు. ఒక ఇండస్ట్రీ రావడం వల్ల ఆ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని..స్థానికులకు ఉద్యోగాలు వస్తాయన్నారు.
కొలిమిగుంట్లలో రామ్ కో పరిశ్రమ వల్ల వెయ్యి మందికి ఉద్యోగాలు వస్తాయని తెలిపారు సీఎం జగన్. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీనే బెస్ట్‌గా ఉందని గుర్తు చేశారు. కర్నూలు జిల్లాలో గ్రీన్ కో ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేశామన్నారు. రైతులకు మంచి జరగడంతోపాటు ఉద్యోగ అవకాశాలు రావాలని..అందుకే పరిశ్రమలపై అధిక దృష్టి పెట్టామని స్పష్టం చేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ వరుసగా మూడోసారి ఫస్ట్ ప్లేస్‌లో నిలిచిందన్నారు సీఎం జగన్.
రానున్న 4 ఏళ్లలో 20 వేల ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతోనే రాష్ట్రంలోకి పరిశ్రమలు వస్తున్నాయన్నారు. తమది ఇండస్ట్రీస్ ఫ్రెండ్లీ ప్రభుత్వం అని సీఎం జగన్ స్పష్టం చేశారు. సోలార్ ప్రాజెక్టుల ఏర్పాటుకు రైతులు ముందుకొస్తే ఎకరాకు ఏడాదికి రూ.30 వేలు లీజు చెల్లిస్తామన్నారు. మూడేళ్లకొసారి 5 శాతం లీజు పెంచుతామని స్పష్టం చేశారు. కనీసం 2 వేల ఎకరాలు ఓ క్లస్టర్‌గా ఉండాలన్నారు. గ్రోత్ రేటులో దేశంలోనే ఏపీ నెంబర్ వన్‌గా ఉందన్నారు సీఎం జగన్. రాబోయే రోజుల్లో ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతాయన్నారు.
Also read:Munugode Bypoll: వారంలో మునుగోడు బైపోల్ షెడ్యూల్.. దసరాకి పండగే పండుగ?
Also read:GVL Narasimha Rao: విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ తధ్యం..బీజేపీ ఎంపీ జీవీఎల్ స్పష్టీకరణ..!
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి