Ys Jagan on Muslim Reservations: ఏపీ ఎన్నికలకు మరో మూడ్రోజులే మిగిలుంది. ఎల్లుండితో ప్రచార పర్వం కూడా ముగియనుంది. ఈక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు కీలక విషయాలు ప్రస్తావించారు. ముస్లిం రిజర్వేషన్లకు తాను అండగా నిలుస్తానని తెలిపారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీలో కూటమి అధికారంలో వస్తే ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తామంటూ వస్తున్న వార్తలపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పందించారు. రిజర్వేషన్ల అంశంపై తన వైఖరిి సుస్పష్టం చేశారు. ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించే అంశంలో తాను నిలబడతానన్నారు. 4 శాతం రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెబుతున్న బీజేపీ జతకట్టి చంద్రబాబు పెద్ద తప్పు చేశారన్నారు. ముస్లింల రిజర్వేషన్లు రద్దు చేస్తామని బీజేపీ చెప్పినప్పుడు చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ధి ఉండి ఉంటే ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేయాల్సి ఉందని జగన్ స్పష్టం చేశారు. అసలు ముస్లిం రిజర్వేషన్లు అనే పదమే తప్పని చెప్పారు. ముస్లింలలో కూడా చాలామందికి 4 శాతం రిజర్వేషన్ లేదన్న విషయాన్ని గుర్తు చేశారు. ముస్లింలలో వెనుకబడినవారికి కల్పించే రిజర్వేషన్లను స్పష్టం చేశారు. మతం ప్రాతిపదికగా ముస్లింలకు కల్పించే రిజర్వేషన్లు తొలగిస్తామని చెప్పడం మంచి పద్ధతి కాదన్నారు. వెనుకబడినవారు కేవలం ముస్లింలలోనే కాకుండా ప్రతి మతంలోనూ ఉంటారని, హిందూవుల్లో కూడా బీసీలున్నారని చెప్పారు.


మరోవైపు బీజేపీ విషయంలో తనకేమీ సాఫ్ట్ కార్నర్ లేదని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. ఏయే విషయాల్లో వ్యతిరేకించాలో అక్కడ వ్యతిరేకిస్తూనే ఉన్నామన్నారు. కేవలం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉండాల్సిన సంబంధాలకు అనుగుణంగా ఉంటున్నామన్నారు. రాష్ట్రానికి రావల్సిన నిధుల విషయంలో సయోధ్యతో ఉంటున్నామన్నారు. కేంద్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలుండాలనేదే తన ఆలోచన అన్నారు. 


ముస్లిం రిజర్వేషన్ల విషయంలో తాను అండగా నిలబడతానని నెల్లూరులో కూడా స్పష్టం చేశానన్నారు. మతం వేరు రిజర్వేషన్లు వేరని చెప్పారు. రిజర్వేషన్ ఆధారంగా ఎవరైనా బాగుపడే సూచనలున్నప్పుడు ఆ అవకాశాన్ని చెడగొట్టడానికి ప్రయత్నించడం ఎంతవరకూ సమంజసమన్నారు.


Also read: YS Sharmila: మొన్న కేసీఆర్‌కు.. ఇప్పుడు మోదీకి షర్మిల గిఫ్ట్‌



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook