AP Corona Cases |  ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 2,593 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా, ఇందులో రాష్ట్రంలో ఉన్నవారికి 2,584 మందికి కరోనా సోకగా, మిగతా 9 కేసులు ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చిన వారిలో నిర్ధారించారు. తాజా కేసులతో కలిపితే ఏపీలో కరోనా కేసులు (AP CoronaVirus Cases) 38,044కు చేరుకున్నాయి. కరోనా నుంచి దేవుడే మనల్ని కాపాడాలి: ఆరోగ్యమంత్రి


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసులకు గాను 19,393 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం 18,159 కరోనా యాక్టీవ్ కేసులున్నాయి. గత 24 గంటల్లో ఏపీలో ఏకంగా 40  కరోనా మరణాలు సంభవించాయి. ఏపీలో ఇప్పటివరకూ కరోనాతో మరణించిన వారి సంఖ్య 492కి చేరింది. ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ ఈ వివరాలు వెల్లడించింది. ఈ మేరకు జులై 16న హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. Corosure: అత్యంత చవకైన కరోనా టెస్ట్ కిట్‌ 


తాజాగా తూర్పు గోదావరిలో 8 మంది, ప్రకాశంలో 8, చిత్తూరులో ఐదుగురు, కడపలో నలుగురు, అనంతపురంలో ముగ్గురు, గుంటూరులో ముగ్గురు, నెల్లూరులో ముగ్గురు, విశాఖపట్నంలో ముగ్గురు, కర్నూలు‌లో ఒక్కరు, శ్రీకాకుళంలో ఒక్కరు, విజయనగరంలో ఒక్కరు చొప్పున కోవిడ్19 బారిన పడి చనిపోయారు.  అదే సమయంలో 943 మంది కరోనా నుంచి కోలుకున్నారు. సెక్సీ హీరోయిన్ Apsara Rani Hot Stills వైరల్


నేటి వరకు రాష్ట్రంలో మొత్తం 12,40,267 శాంపిల్స్ పరీక్షించగా ఏపీ నుంచి 35,159 మందికి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 2,453 మందికి, విదేశాల నుంచి వచ్చిన వారిలో 432 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు.  RGV ‘నగ్నం’ హీరోయిన్ స్వీటీ Hot Photos
జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..