AP COVID-19 cases: ఏపీలో తగ్గిన కరోనా పాజిటివిటీ రేటు.. తగ్గని మరణాలు
COVID-19 cases in AP: అమరావతి: ఏపీలో తాజా హెల్త్ బులెటిన్‌లో వెల్లడించిన వివరాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 90609 మందికి కరోనా పరీక్షలు చేయగా వారిలో 19,981 మందికి కరోనా పాజిటివ్ అని నిర్థారణ అయినట్టు గుర్తించారు. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు మొత్తం సంఖ్య 15,62,060 కి చేరింది.
COVID-19 cases in AP: అమరావతి: ఏపీలో తాజా హెల్త్ బులెటిన్‌లో వెల్లడించిన వివరాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 90609 మందికి కరోనా పరీక్షలు చేయగా వారిలో 19,981 మందికి కరోనా పాజిటివ్ అని నిర్థారణ అయినట్టు గుర్తించారు. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు మొత్తం సంఖ్య 15,62,060 కి చేరింది. ఏపీలో కరోనా పాజిటివిటీ రేటు 25.5 % నుండి 22.0 శాతానికి తగ్గింది. అదే సమయంలో కరోనాతో 118 మంది మృతి చెందారు. కరోనా పాజిటివ్ కేసులు కాస్త తగ్గుముఖం పట్టినట్టే కనిపించినప్పటికీ మృతుల సంఖ్యే తగ్గకపోవడం ఆందోళనరేకెత్తిస్తోంది. ఇప్పటివరకు కరోనా వైరస్‌తో మృతి చెందిన వారి సంఖ్య మొత్తం 10,022 కి చేరింది.
[[{"fid":"209203","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Andhra pradesh COVID-19 latest health bulletin: AP govt focused on black fungus cases","field_file_image_title_text[und][0][value]":"AP COVID-19 cases: ఏపీ కరోనా లేటెస్ట్ హెల్త్ బులెటిన్"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Andhra pradesh COVID-19 latest health bulletin: AP govt focused on black fungus cases","field_file_image_title_text[und][0][value]":"AP COVID-19 cases: ఏపీ కరోనా లేటెస్ట్ హెల్త్ బులెటిన్"}},"link_text":false,"attributes":{"alt":"Andhra pradesh COVID-19 latest health bulletin: AP govt focused on black fungus cases","title":"AP COVID-19 cases: ఏపీ కరోనా లేటెస్ట్ హెల్త్ బులెటిన్","class":"media-element file-default","data-delta":"1"}}]]
ప్రస్తుతం ఏపీలో 2,10,683 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం ఇప్పటివరకు రాష్ట్రంలో 13,41,355 మంది కొవిడ్-19 (COVID-19) నుంచి కోలుకున్నారు.