Eluru Rape incident: కోల్‌కతా వైద్యురాలి రేప్‌, మర్డర్‌ ఘటనతో దేశం అట్టుడికిపోతుంది. ఈ దారుణాన్ని మరువక ముందే మరో ఘటన ఏపీలో చోటు చేసుకుంది. పొట్టకూటి కోసం వచ్చిన భార్తభర్తలపై కన్నవేసిన ముగ్గురు జులాయిలు భర్తను చితక్కొట్టి భార్యపై అత్యాచారం చేశారు. ఆ వివరాలు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పొట్టకూటి కోసం ఇటీవలె ఏలూరుకు వచ్చిన భార్యభర్తలు. ఓ హోటల్లో పని చేయడం మొదలుపెట్టారు. అయితే, జీతం డబ్బులు వచ్చాక ఇంటిని అద్దెకు తీసుకువచ్చు అని స్థానికంగా ఉండే ఓ భవనంలో రాత్రి సమయంలో నిద్ర పోయేవారు. అయితే, వీరిని గమనించిన ఓ ముగ్గురు జులాయిలు వారితో పరిచయం పెంచుకున్నారు. భార్యపై కన్నేసిన ఈ ప్రబుద్ధులు వారితో మంచిగా మెలగడం ప్రారంభించారు. ఈ పరిచయంతో వారు శుక్రవారం రాత్రి భర్త ప్లాన్‌ వేసి మందు తాగించారు. భర్త నిద్రలోకి జారుకున్నాడు. దీంతో వారికి శారీరకంగా సహకరించాలని, లేకపోతే భర్తను చంపేస్తామని బెదిరించారు. దీనికి ఆమె ససేమిరా ఒప్పుకోకపోవడంతో దాడి చేసి లాక్కెళ్లడానికి ప్రయత్నించారు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో నిద్ర లేచిన భర్త ఆ మృగాళ్లను అడ్డుకున్నాడు.


వారు అతడిపై తీవ్రంగా దాడి చేశారు. కాళ్లపై చితక్కొట్టారు. ఆపై భార్యను దగ్గర్లో ఉన్న భవనంలోకి లాక్కెల్లిన ముగ్గురు జులాయిలు అత్యాచారం చేశారు. కాళ్లతో నడవలేని దుస్థితిలో ఉన్న భర్త రోడ్డుపైకి వెళ్లి సహాయం కోసం అర్థించాడు. దీంతో అటుగా వెళ్తున్న యువకులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. యువకులు వెళ్లి గమనించగా ఆ మృగాళ్లు బాధితురాలిని అక్కడే వదిలేసి పారిపోయారు.


సమాచారం అందిన పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. బాధితురాలిని ఏలూరు జీజీహెచ్‌కు తరలించారు. ఆమెకు మెరుగైన వ్యైద్యం అందిస్తున్నారు.  ఆ మహిళపై అత్యాచారానికి ఒడిగట్టిన నిందితులు శనివారం రోజు గజ్జవారి చెరువు దగ్గర్లో ఉన్న బార్‌ వద్ద ఉండటంతో పోలీసులు వెంటనే వారిని అరెస్టు చేశారు. అయితే, ఈ ముగ్గురు మృగాళ్లు ఏలూరు టీచర్స్‌ కాలనీలోని చెంచుకాలనీకి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు నిందితులు నూతిపల్లి పవన్‌- లంబాడీపల్లి, సాయిబాబా గుడి ప్రాంతానికి చెందిన నాగేంద్ర నారపాటి, ఎంఆర్‌కాలనీకి చెందిన గడ్డి విజయ్‌ కుమార్‌గా గుర్తించారు.
 



ఇదీ చదవండి: ఆడుదాం ఆంధ్రాలో అవినీతి.. ఆర్‌కే రోజా అరెస్ట్‌కు రంగం సిద్ధం?


కోల్‌కతా వైద్యురాలి రేప్‌ , మర్డర్‌ అంటేనే మరో నిర్భయ తరహా ఘటన. దేశవ్యాప్తంగా నిందితులను పట్టుకుని సరైన శిక్ష విధించాలని ర్యాలీలు చేస్తున్న సమయంలో ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. వైద్యురాలి ఘటనపై ప్రముఖులు కూడా సోషల్‌ మీడియా, మీడియా ముఖంగా కూడా సంతాపం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. బాధితురాలికి సరైన న్యాయం జరగాలని కోరుతున్నారు. అయినా దేశవ్యాప్తంగా ఏదో మూలన ఇలాంటి ఘటననలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి.
 


ఇదీ చదవండి: మాజీ సీఎం వైఎస్‌ జగన్‌కు బాలకృష్ణ దెబ్బ అదుర్స్‌.. ఇక తిరుగేలేదు


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter