Ysrcp Manifesto: 2019 ఎన్నికల్లో నవరత్నాలతో ముందుకొచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎలాంటి హామీలతో ముందుకు రానుందనేది ఆసక్తి కల్గిస్తోంది. ఎక్కడికక్కడ అభ్యర్ధుల్ని మార్చుతూ వైనాట్ 175 లక్ష్యం పెట్టుకున్న వైఎస్ జగన్..ఇప్పుడు ఓటర్లను ఆకట్టుకునేందుకు ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసేందుకు సిద్ధమైంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీ ఎన్నికలకు సమాయత్తమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. మార్చ్ 10వ తేదీన బాపట్ల జిల్లా మేదరమిట్లలో ఏర్పాటు కానున్న నాలుగో సిద్ధం సభ ఇందుకు వేదిక కానుంది.. ఈ సభ సాక్షిగా రానున్న ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయనుంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పటి వరకూ చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని వివరించడమే కాకుండా..ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తోంది. దీనికి సంబంధించిన వివరాల్ని ఎంపీ విజయసాయి రెడ్డి వివరించారు. రానున్న కాలంలో ప్రజలకు మరింత మేలు చేకూర్చేందుకు ఎలాంటి పథకాలు అమలు చేయనున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించనున్నామని చెప్పారు. ఎలాంటి పధకాలు అమలు చేస్తామో జగన్ వివరిస్తానన్నారు. 


ఇప్పటి మేనిఫెస్టో కోసం సీనియర్ ఐఏఎస్ అధికారులు, పార్టీ నేతలతో ముఖ్యమంత్రి జగన్ సమావేశమయ్యారు. ఇప్పటికే ఇస్తున్న నవరత్నాల్ని కొనసాగిస్తూ..మరికొన్ని పథకాలు చేర్చేందుకు సిద్ధమౌతున్నారు. మరీ ముఖ్యంగా రైతు రుణమాఫీ, పింఛన్ పెంపు, జీవన భృతి పథకాల్ని చేర్చవచ్చని తెలుస్తోంది. మార్చ్ 10న జరగనున్న సిద్ధం సభకు దాదాపుగా 15 లక్షలమంది హాజరౌతారనేది అంచనా ఉందని విజయసాయి రెడ్డి తెలిపారు. వెనుకబడిన వర్గాల అభివృద్ధి, సంక్షేమం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందనేది అందరికీ తెలుసని విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. అందుకే సిద్దం సభలకు ఒకదాన్ని మించి మరొకటిగా జనం తరలివస్తున్నారన్నారు. మార్చ్ 10వ తేదీ తరువాత ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుందన్నారు. 


Also read;  7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హోళి కానుక, వచ్చే నెల నుంచి పెరగనున్న జీతం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook