Anaparthy Seat Dispute: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూటమిగా ఏర్పడిన తెలుగుదేశం-బీజేపీ-జనసేన మధ్య సీట్ల పంచాయితీ అసమ్మతికి దారితీస్తోంది. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం స్థానాన్ని బీజేపీకు కేటాయించడంపై తెలుగుదేశంలో అసమ్మతి రేగుతోంది. స్థానిక నేత, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీలో కూటమి చిచ్చు అనపర్తిలో అలజడి రేపుతోంది. మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వర్గం ఆగ్రహంగా ఉంది. వాస్తవానికి కూటమిలో బీజేపీ చేరకనముందు తెలుగుదేశం ప్రకటించిన తొలి జాబితాలో అనపర్తి అసెంబ్లీ స్థానం మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికే కేటాయించినట్టు ఉంది. కానీ ఆ తరువాత జరిగిన పరిణామాల్లో నల్లమిల్లి సీటు గల్లంతయింది. కూటమిలో చేరిన బీజేపీ వాస్తవానికి రాజమండ్రి సిటీ కోరింది. అయితే ఈ స్థానం అప్పటికే తెలుగుదేశం నేత ఆదిరెడ్డి వాసుకు కేటాయించడమే కాకుండా మార్చేందుకు చంద్రబాబు ఇష్టపడలేదు. దాంతో రాజమండ్రికి ప్రత్యామ్నాయంగా తెలుగుదేశం పార్టీ బీజేపీకు అనపర్తి స్థానాన్ని ఆఫర్ చేసింది. తాజా ఆ పార్టీ తమ అభ్యర్ధిని కూడా ప్రకటించింది. 


దాంతో అనపర్తి తెలుగుదేశంలో ఒక్కసారిగా వ్యతిరేకత భగ్గుమంది. మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అనుచరులు ఆగ్రహంతో పార్టీ కరపత్రాలు, జెండాలు, సైకిల్ దగ్దం చేశారు. నల్లమిల్లి కూడా తన ఆవేదన వ్యక్తం చేశారు. తనకు టికెట్ రాకుండా కుట్ర చేశారని, జరిగిన అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తానని స్పష్టం చేశారు. రేపు అంటే శుక్రవారం ఆత్మీయులతో సమావేశం కానున్నారు. కుటుంబంతో కలిసి ప్రజల్లోకి వెళ్లి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో ఏ మాత్రం బలం లేని పార్టీకు సీటు ఎలా అప్పగిస్తారని, మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని తెలిపారు. 


సీటు ఇచ్చినట్టే ఇచ్చి లాక్కోవడంపై తెలుగుదేశం శ్రేణులు మండిపడుతున్నారు. చంద్రబాబు కట్టప్ప రాజకీయాలంటూ నినాదాలు చేస్తున్నారు. అనపర్తిలో నెలకొన్న అసమ్మతి పరోక్షంగా రాజమండ్రి ఎంపీ స్థానంపై కూడా పడనుంది. గత 2-3 సార్లు రాజమండ్రి పార్లమెంట్ ఎంపీ అభ్యర్ధి గెలుపులో లేదా విజయంలో అనపర్తి నియోజకవర్గానిదే కీలక పాత్ర. 


Also read: SRH Sentiment: ఆరెంజ్ ఆర్మీకు ఆసిస్ కెప్టెన్ల సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook