Ys Jagan Bus Yatra: ఇవాళ్టి నుంచే ఇడుపులపాయ టు ఇచ్చాఫురం బస్సు యాత్ర
Ys Jagan Bus Yatra: ఏపీలో ఎన్నికల ప్రచార పర్వం మొదలైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర ప్రారంభిస్తున్నారు. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ సాగే బస్సు యాత్ర షెడ్యూల్ ఇలా ఉంది.
Ys Jagan Bus Yatra: ఇడుపులపాయ వైఎస్ఆర్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్ధనల అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బస్సు యాత్ర ప్రారంభించనున్నారు. 21 రోజులపాటు సాగే ఈ యాత్రలో రోజూ ఒక నియోజకవర్గంలో బహిరంగ సభ ఉంటుంది. ఇవాళ మద్యాహ్నం 1.30 గంటలకు బస్సు యాత్ర ప్రారంభం కానుంది. సిద్ధం సభల తరువాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచార పర్వం బస్సు యాత్రతో మొదలవుతోంది.
ఇవాళ మొదటిరోజు బస్సు యాత్ర కడప పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉంటుంది. ఇడుపులపాయ నుంచి వేంపల్లి, వీరపురాయని పల్లె, ఎర్రగుంట్ల మీదుగా ప్రొద్దుటూరు చేరుకుంటుంది. సాయంత్రం ప్రొద్దుటూరులో తొలి బహిరంగ సభ ఉంటుంది. అక్కడ్నించి దువ్వూరు, చాగలమర్రి మీదుగా నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. రేపు అంటే రెండో రోజు బస్సు యాత్ర నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉంటుంది. సిద్ధం సభలు జరిగిన 4 పార్లమెంట్ నియోజకవర్గాలు తప్ప మిగిలిన 21 నియోజకవర్గాలు చుడుతూ బస్సు యాత్ర ఉంటుంది. గతంలో వైఎస్ జగన్ తలపెట్టిన ఓదార్పు యాత్రను మించి ఈ యాత్ర ఉంటుందంటున్నారు. ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడేనాటికి తొలి దశ ప్రచారం బస్సు యాత్ర పూర్తి కానుంది.
ప్రతిరోజూ ఉదయం వేళ వివిధ వర్గాల ప్రజలతో సమావేశమై సలహాలు, సూచనలు స్వీకరిస్తారు. సమస్యలు వింటారు. సాయంత్రం వేళ బహిరంగ సభ ఉంటుంది. ఇప్పటికే జరిగిన నాలుగు సిద్దం సభలు విజయవంతం కావడంతో కార్యకర్తలు, నేతలు ఉత్సాహంతో ఉన్నారు. బస్సు యాత్ర తరువాత రెండో దశ ప్రచారంరపై దృష్టి సారించనున్నారు.
Also read: AP Elections 2024: తెలుగుదేశంకు షాక్, వైసీపీ చేరనున్న మాజీ ఎంపీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook