YSRCP Ready To Election: వైసీపీ ఐదో జాబితాలో భారీ మార్పులు.. మాజీ మంత్రి అనిల్‌కు జాక్‌పాట్
YSRCP 5th List: ఎన్నికలకు సిద్ధమైన వైఎస్సార్ సీపీ అభ్యర్థుల మార్పులు చేర్పులను కొనసాగిస్తోంది. ఇప్పటికే నాలుగు జాబితాలుగా మార్పులు చేసిన అధికార పార్టీ తాజాగా మరో జాబితాను విడుదల చేసింది. తాజా జాబితాలో నాలుగు ఎంపీ, మూడు అసెంబ్లీ సెగ్మెంట్‌లకు పార్టీ ఇన్చార్జీలను మార్చేసింది.
YSRCP Candidates List: సార్వత్రిక ఎన్నికలకు ఏపీలోని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సన్నద్ధమవుతోంది. ఇప్పటికే ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రకటన చేస్తున్న వైసీపీ తాజాగా ఐదో జాబితాను విడుదల చేసింది. తాజాగా 4 ఎంపీ, 3 అసెంబ్లీ స్థానాల్లో మార్పులు చేర్పులు చేసింది. ఈ మార్పుల్లో మాజీ మంత్రి, నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్‌కు నర్సరావుపేట పార్లమెంట్ స్థానానికి ఎంపిక చేయడం గమనార్హం.
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా పార్టీ సమన్వయకర్తల మార్పులు చేర్పులు చేస్తున్న వైఎస్సార్‌సీపీ తాజాగా ఐదో జాబితాను ప్రకటించింది. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి బొత్స సత్యనారాయణ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి సమన్వయకర్తల మార్పును ప్రకటించారు. 'మొత్తం 175కు 175 సీట్లు గెలవాలనే ప్రయత్నంలో భాగంగా అభ్యర్థులను మార్పులుచేర్పులు చేస్తున్నాం' అని వారు తెలిపారు. సామాజిక సమీకరణాలు, అభ్యర్థుల గెలుపోటములను అంచనా వేసుకుని ఈ మార్పులు చేస్తున్నట్లు వివరించారు.
కొత్తగా పార్టీ బాధ్యతలు
తాజాగా సీనియర్ నాయకులకు పార్టీ బాధ్యతలు అప్పగించింది. పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ విజయసాయిరెడ్డికి అదనంగా గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ బాధ్యతలను అప్పగించింది. ఒంగోలు పార్లమెంట్ సెగ్మెంట్ రీజనల్ కో ఆర్డినేటర్‌గా చెవిరెడ్డి విజయ భాస్కర్ రెడ్డిని నియమించింది. కందుకూరు, సంతనూతలపాడు, కావలి అసెంబ్లీ సెగ్మెంట్‌లకు కూడా రీజనల్ కో ఆర్డినేటర్‌గా చెవిరెడ్డిని నియమించింది.
ఐదో జాబితా ఇదే..
కాకినాడ (ఎంపీ)- చలమలశెట్టి సునీల్
నర్సరావుపేట (ఎంపీ)-అనిల్‌కుమార్ యాదవ్
తిరుపతి (ఎంపీ)-గురుమూర్తి
మచిలీపట్నం (ఎంపీ)- సింహాద్రి రమేష్ బాబు
సత్యవేడు (ఎమ్మెల్యే) - నూకతోటి రాజేశ్
అరకు వేలి (ఎమ్మెల్యే)- రేగం మత్స్యలింగం
అవనిగడ్డ (అసెంబ్లీ) - డా.సింహాద్రి చంద్రశేఖరరావు
వరుసగా జాబితాలు ఇలా..
తొలి జాబితా: 11 అసెంబ్లీ స్థానాలు
రెండో జాబితా: 27 స్థానాలు (౩ ఎంపీ, 24 అసెంబ్లీ)
మూడో జాబితా: 21 స్థానాలు (6 ఎంపీ, 15 అసెంబ్లీ)
నాలుగో జాబితా: 8 స్థానాలు (1 ఎంపీ, 8 అసెంబ్లీ)
ఐదో జాబితా: 7 స్థానాలు (4 ఎంపీలు, 3 అసెంబ్లీ)
Also Read: Women Cheat Delhi Hotel: స్టార్ హోటల్‌లో మోసం చేయబోయి చిక్కిన తెలుగింటి మహిళ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి