Tirumala Ghat: తిరుమల ఘాట్ రోడ్డులో ఏనుగుల హల్ చల్.. రోడ్డు మీద భారీగా ట్రాఫిక్ జామ్..
Tirumala Ghat: తిరుమల ఘాట్ రోడ్డులో ఏనుగులు హల్ చల్ చేశాయి. దీంతో భక్తులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. శుక్రవారం సాయంత్రం ఏడో మైలు వద్ద ఏనుగు ఆర్చికి సమీపంలో రోడ్డుకు దగ్గరగా ఆరు ఏనుగులు వచ్చాయి.
Elephants Group halchal in Tirupati Ghat Road: కొన్నిరోజులుగా తిరుమలలోని అడవుల నుంచి క్రూరజంతువులు బైటకు వస్తున్నాయి. ఇప్పటికే చిరుత పులులు, ఘాట్ మెట్ల మార్గం గుండా ప్రయాణిస్తున్న భక్తులపై దాడులు చేస్తున్నాయి. దీనికి సంబంధించిన అనేక ఘటనలు వార్తలలో నిలిచాయి. ముఖ్యంగా చిన్న పిల్లలపై చిరుత పులులు దాడులు చేసిన ఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. అదే విధంగా..దీనిపైన గత ఏపీ ప్రభుత్వం చేతిలో పొడవైన కర్రలను కూడా తమతోపాటు, పెట్టుకొవాలని కూడా సూచించారు.
Read more: Lightning strikes: బాప్ రే.. వర్షంలో మైరచిపోయి యువతి రీల్స్ .. పక్కనే పిడుగు పాటు.. వీడియో వైరల్..
ఈ నేపథ్యంలో ఇటీవల తిరుమలలో ఏనుగుల గుంపు హల్ చల్ చేశాయి. ఘాట్ రోడ్డులోని మెట్ల మార్గం గుండా స్వామి వారి దర్శనం కోసం వెళ్తున్న భక్తులకు చుక్కలు చూపించాయి. మొదటి ఘాట్‌రోడ్డులో శుక్రవారం సాయంత్రం ఏనుగుల గుంపు కన్పించింది. ఏనుగుల గుంపు రోడ్డుకు దగ్గరగా వచ్చాయి. అంతేకాకుండా.. ఏడవ మైలు దగ్గర చెట్లను విరిచేస్తూ, పెద్దగా అరుస్తూ కనిపించాయి. ఏనుగుల గుంపును చూసి భక్తులు భయంతో దూరంగా పారిపోయారు. కొందరు వాహనదారులు తన వాహనాలను రోడ్డుపై నిలిపివేశారు. దీని వల్ల దాదాపు రెండు కిలోమీటర్ల వరకు వాహనాలు ఆగిపోయాయి.
వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోవడంతో ఘాట్ రోడ్డులో చాలాసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. ఏనుగులు హల్ చల్ చేసిన విషయాన్ని.. భక్తులు టీటీడీ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఫారెస్ట్, విజిలెన్స్ విభాగాల అధికారులురంగంలోకి దిగారు.వెంటనే ఘాట్ వద్దకు చేరుకుని ఏనుగులు అడవిలోకి వెళ్లేలా గట్టిగా శబ్దాలు చేశారు. దీంతో ఏనుగులన్ని తిరిగి తమ అడవిలోకి వెళ్లిపోయాయి.
Read more: Snake Viral Video: కమ్మని నిద్రలో ఉండగా లోదుస్తుల్లోకి దూరిపోయిన పాము.. వీడియో వైరల్..
ఈ నేపథ్యంలో భక్తులు తీవ్ర భయాందోళనలకు గురైనట్లు తెలుస్తోంది. ఇప్పటి దాక చిరుతలు, పాములతో భయపడిపోయిన భక్తులు, ఇప్పుడు ఏనుగులు కూడా ఘాట్ ల దగ్గరకు రావడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు భక్తులు అలర్ట్ గా ఉండాలని కూడా టీటీడీ అధికారులు సూచలను చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి