Vatti Vasanth Kumar: విషాదం.. మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ కన్నుమూత
Vatti Vasanth Kumar: ఏపీ మాజీ మంత్రి వసంత్‌కుమార్ అనారోగ్యంతో ఇవాళ కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయనకు రాజకీయాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.
Vatti Vasanth Kumar Passes away: ఉమ్మడి ఏపీ మాజీ మంత్రి వట్టి వసంత కుమార్ (70) ఇవాళ ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. విశాఖలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మార్నింగ్ తుదిశ్వాస విడిచారు. పశ్చిమ గోదావరి జిల్లా పూళ్ల గ్రామం ఈయన స్వస్థలం. 1955లో వసంత కుమార్ జన్మించారు. 1978లో ఆంధ్రా యూనివర్శిటీ నుంచి ఎంబీఏ చేశారు. ఈయన చాలా ముక్కుసూటి మనిషి. ఈయన మృతికి పలువురు నేతలు సంతాపం ప్రకటించారు.
కాంగ్రెస్ తరుపున ఉంగుటూరు నుంచి 2004, 2009 ఎన్నిక్లలో ఎమ్మెల్యేగా గెలిచారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ లలో వసంత కుమార్ మంత్రిగా పలు శాఖలను నిర్వహించారు. గ్రామీణాభివృద్ధి, పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశారు. 2014లో రాష్ట్ర విభజన, ఆయన భార్య మరణం కారణంగా వసంత కుమార్ పాలిటిక్స్ కు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఆయన భౌతిక కాయాన్ని స్వగ్రామానికి తరలించేందుకు ఫ్యామిలీ మెంబర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈయన మృతితో కాంగ్రెస్ శ్రేణుల్లో విషాదం నెలకొంది.
Also Read: Nandamuri Taraka Ratna Health: అత్యంత విషమంగా తారక రత్న ఆరోగ్య పరిస్థితి.. బులెటిన్లో ఏముందంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook