Ap deputy cm pawan kalyan convoy: ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి బ్రహ్మరథం పట్టారు. దీనిలో భాగంగా ఇటీవల చంద్రబాబు, మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించి,ఆయా మంత్రులకు శాఖలను కూడా కేటాయించారు. మంత్రులకు శాఖలను కేటాయించడంతో చంద్రబాబు తన మార్కును చూపించారు. ఏపీలో ఈసారి ఎలాగైన గెలవాలని కూటమి గా కలసి నేతలు ఎన్నికల బరిలో దిగారు. ఎక్కడ కూడా భేషజాలకు పోకుండా.. సమిష్టిగా ప్రచారం నిర్వహించి, టీడీపీ ఇచ్చిన 21  స్థానాల్లో గెలుపొంది జనసేన వందశాతం స్ట్రైక్ రేట్ ను సాధించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



ఇదిలా ఉండగా.. సీఎం చంద్రబాబు నాయుడు సైతం.. జనసేనకు కూడా మంత్రివర్గంలో చోటు కల్పించారు. అన్ని ప్రభుత్వ శాఖల్లో తన ఫోటోపక్కన పవన్ కళ్యాణ్ ఫోటోఉండేలా చేసి సముచిత స్థానం కల్పించారు. పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎంతోపాటు, మరో నాలుగు శాఖలను కూడా కేటాయించారు. కీలకమైన పంచాయతీ రాజ్‌ శాఖ, గ్రామీణాభివృద్ధి & గ్రామీణ నీటి సరఫరా శాఖ, అటవీ – పర్యావరణ శాఖ, సైన్స్ & టెక్నాలజీ శాఖకు కూడా పవన్ కు  అప్పజెప్పారు. ఇదిలా ఉండగా.. ఈ నెల 19 జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించనున్నారు.  


ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ హైదరాబాద్ నుంచి విజయవాడ గన్నవరం చేరుకున్నారు. అక్కడి నుంచి అమరావతికి వెళ్తారు.ఈ క్రమంలో వెలగపూడి సచివాలయం వరకు మానవహారంతో స్వాగతం పలికేందుకు రాజధాని రైతులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రెండో బ్లాక్‌లోని తనకు కేటాయించిన ఛాంబర్‌ను పరిశీలిస్తారు. పవన్ ఉప ముఖ్యమంత్రిగా బుధవారం తన ఛాంబర్‌లో బాధ్యతలు తీసుకుంటారు. ఇదిలా ఉండగా ఏపీ ప్రభుత్వం పవర్ కళ్యాణ్ కు.. పవన్ కళ్యాణ్‌కు భద్రత పెంచింది.


Read more: Chandrababu naidu: ఐదేళ్లుగా శపథం.. చంద్రబాబు సీఎం అయ్యాకే పుట్టింట్లో కాలు పెట్టిన మహిళ.. వీడియో వైరల్..


ఆయనకు Y ప్లస్ సెక్యూరిటీతో పాటు ఎస్కార్ట్, బుల్లెట్ ప్రూఫ్ కారును కేటాయించారు.  ఈ నేపథ్యంలో.. ముఖ్యమంత్రి చంద్రబాబును పవన్ మర్యాదపూర్వకంగా కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ సెక్యురిటీ ఎస్కార్ట్ కు చెందిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter