AP Incharge Ministers 2024: ఏపీలో ఇన్చార్జ్ మంత్రుల నియామకం, ఏ జిల్లాకు ఎవరంటే
AP Incharge Ministers 2024: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రుల్ని నియమించింది. ప్రభుత్వ సంక్షేమ పధకాలు, ఇతర కార్యక్రమాలకు సజావుగా సాగేందుకు వీలుగా ఈ నియామక ప్రక్రియ జరిగింది. ఏయే జిల్లాలకు ఎవరెవరు బాధ్యులో తెలుసుకుందాం.
AP Incharge Ministers 2024: ఏపీలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని 26 జిల్లాల బాధ్యతల్ని కొందరు మంత్రులకు అప్పగించింది. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ మంత్రి నారా లోకేశ్ మినహా మిగిలిన అందర్నీ జిల్లాలకు ఇన్‌ఛార్జీలుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఒకరిద్దరు మంత్రులకు ఒకటి కంటే ఎక్కువ జిల్లాల బాధ్యతలు అప్పగించారు. ఇక నుంచి జిల్లాల్లో జరిగే పరిపాలన వ్యవహారాల్ని ఆయా ఇన్‌ఛార్జి మంత్రులే పర్యవేక్షిస్తారు.
శ్రీకాకుళం జిల్లా కొండపల్లి శ్రీనివాస్
పార్వతీపురం మన్యం, కోనసీమ కింజరపు అచ్చెన్నాయుడు
విజయనగరం వంగలపూడి అనిత
విశాఖపట్నం బాల వీరాంజనేయ స్వామి
అల్లూరి సీతారామరాజు జిల్లా సంధ్యారాణి
అనకాపల్లి కొల్లు రవీంద్ర
తూర్పు గోదావరి, కర్నూలు నిమ్మల రామానాయుడు
కాకినాడ పి నారాయణ
పశ్చిమ గోదావరి, పల్నాడు జిల్లాలు గొట్టిపాటి రవికుమార్
బాపట్ల పార్ధసారధి
గుంటూరు కందుల దుర్గేశ్
కృష్ణా జిల్లా వాసంశెట్టి సుభాష్
ఎన్టీఆర్ జిల్లా సత్యకుమార్
ప్రకాశం ఆనం రాం నారాయణరెడ్డి
నెల్లూరు ఎన్ఎండి ఫరూఖ్
చిత్తూరు జిల్లా రాంప్రసాద్
అనంతపురం టీజీ భరత్
కడప సవిత
అన్నమయ్య జిల్లా బీసీ జనార్ధన్
ఏలూరు నాదెండ్ల మనోహర్
తిరుపతి, సత్యసాయి జిల్లాలు అనగాని సత్య ప్రసాద్
నంద్యాల పయ్యావుల కేశవ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.