AP Govt: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త అందించింది. బదిలీల కోసం ఎదురుచూస్తున్న వారికి తీపి కబురు చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఉద్యోగుల సాధారణ బదిలీల దస్త్రంపై సీఎం వైఎస్ జగన్‌ సంతకం చేశారు. ఈనెల 17లోగా బదిలీల ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. దీనిపై త్వరలో అధికారిక ఉత్తర్వులు రానున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బదిలీల్లో ఉద్యోగుల అర్హత, ఖాళీల వివరాలు, ఇతర నిబంధనలపై త్వరలో క్లారిటీ రానుంది. బదిలీలపై అధికారుల నుంచి కీలక విషయాలను సీఎం జగన్ రాబట్టినట్లు తెలుస్తోంది. ఎలాంటి వివాదాలు, ఆరోపణలు రాకుండా ఉద్యోగుల బదిలీల ప్రక్రియ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సీఎం జగన్ నిర్ణయంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సాధారణ బదిలీల కోసం ఉద్యోగులు ఎంతో  కాలంగా వేచి చూస్తున్నారు. ఇప్పటికీ తమ నిరీక్షణ తీరిందంటున్నారు.


ఏపీలో ఇప్పటివరకు సాధారణ బదిలీలపై నిషేధం ఉంది. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. సాధారణ బదిలీలపై ఉన్న నిషేధాన్ని జగన్ ప్రభుత్వం తొలగించింది. త్వరలో సాధారణ ఉద్యోగుల బదిలీలు జరగనున్నాయి.


Also read: Bjp Leaders Tour: తెలంగాణపై ప్రధాని మోదీ ఫోకస్..రేపు పార్టీ ముఖ్య నేతలతో మంతనాలు..!


Also read:Hyderabad gang rape case: హైదరాబాద్ గ్యాంగ్ రేప్‌ కేసులో ట్వీస్ట్..రిమాండ్ రిపోర్టులో ఏముందంటే..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook