GO No.2 Withdraw: సర్పంచులకు గుడ్ న్యూస్.. జీవో నం.2ను వెనక్కి తీసుకున్న ఏపీ సర్కారు
GO No.2 Withdraw: సర్పంచులు, పంచాయతీ సెక్రటరీల అధికారాలను వీఆర్వోలకు అప్పగిస్తూ జారీ చేసిన జీవో నంబరు 2 ఉత్తర్వులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. దీనిపై సర్పంచుల సంఘం ఏపీ హైకోర్టును ఆశ్రయించగా.. ఆ జీవోను వెనక్కి తీసుకుంటున్నట్లు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
GO No.2 Withdraw: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో పంచాయతీ సర్పంచులు, సెక్రటరీల అధికారాలను వీఆర్వోలకు అప్పగిస్తూ ఏపీ సర్కారు జారీ చేసింది. ఇప్పుడా ఉత్తర్వులను వెనక్కు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. పంచాయతీ సర్పంచులు, సెక్రటరీల అధికారాలను వీఆర్వోలకు అప్పగిస్తూ ఈ ఉత్తర్వులను ఏపీ సర్కార్ జారీ చేసింది.
అయితే, ప్రభుత్వం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సర్పంచుల సంఘం ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. జీవో నెంబర్ 2 పంచాయతీ రాజ్ చట్టానికి విరుద్ధమని పిటిషనర్లు పేర్కొన్నారు. దీంతో సర్పంచుల పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు గతంలోనే జీవో నెంబర్ 2ను సస్పెండ్ చేసింది.
అయితే దీనిపై మరోసారి హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం జీవో నెంబర్ 2ను వెనక్కి తీసుకుంటున్నట్లు హైకోర్టుకు వెల్లడించింది. అయితే, ఈ జీవోపై హైకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో ప్రభుత్వం జీవోను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
ఈ జీవో నంబరు 2 గురించి వివరాల్లోకి వెళితే.. సర్పంచులు, సెక్రటరీల అధికారాలను వీఆర్వోలకు అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం ఈ జీవోను తీసుకొచ్చింది. అయితే దీనిపై సర్పంచులు, కార్యదర్శుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
ఈ జీవో వలన తమ పదవికి ఎటువంటి ప్రాధాన్యం లేకుండా అవుతుందని గ్రహించిన సర్పంచులు కోర్టుకు వెళ్లారు. ప్రస్తుతం హైకోర్టులో దీనిపై విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ జీవోపై ఏపీ ప్రభుత్వం వెనకడుగు వేసింది. జీవో నంబర్ 2ను వెనక్కి తీసుకుంటున్నట్లు హైకోర్టుకు వెల్లడించింది ఏపీ ప్రభుత్వం.
Also Read: Ap Corona Update: ఏపీలో కొత్తగా 434 కరోనా కేసులు...యాక్టివ్ కేసులు ఎన్నంటే?
Also Read: AP Omicron cases: ఏపీలో మరో 4 ఒమిక్రాన్ కేసులు... మొత్తం కేసులెన్నంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.