Water Bell: డీ హైడ్రేషన్ నివారించేందుకు ఏపీ స్కూళ్లలో ఇకపై వాటర్ బెల్
Water Bell: వేసవి తాపం పెరుగుతోంది. ఎండలు మండిపోతున్నాయి. చిన్నారుల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని ఏపీ ప్రభుత్వం వినూత్న ఆలోచన చేసింది. ఇకపై స్కూళ్లలో వాటర్ బెల్ మోగనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Water Bell: ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు మండిపోతున్నాయి. కొన్ని జిల్లాల్లో అయితే వడగాల్పులు వీస్తున్నాయి. స్కూళ్లకు వెళ్లే చిన్నారు ఆరోగ్యాన్ని పరిగణలో తీసుకుని ప్రభుత్వం వినూత్న ఆలోచన చేసింది. డీ హైడ్రేషన్ సమస్య తలెత్తకుండా వాటర్ బెల్ మోగించాలని కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఎండాకాలంలో ప్రదానంగా తీసుకోవల్సిన జాగ్రత్తల్లో ముఖ్యమైంది నీళ్లు ఎక్కువగా తాగడం. శరీరం డీ హైడ్రేట్ కాకుండా చూసుకోవల్సి ఉంటుంది. ముఖ్యంగా వడగాల్పులు వీస్తున్నప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలి. ప్రస్తుతం ఏపీలో ఒంటి పూట బడులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని డీ హైడ్రేషన్ సమస్య తలెత్తకుండా ఉండేందుకు రోజుకు మూడు సార్లు వాటర్ బెల్ మోగించాలని విద్యాశాఖ ఆదేశించింది. ఈ ఆదేశాల ప్రకారం రోజూ ఉదయం 8.45 గంటలకు, 10.50 గంటలకు, 11.50 గంటలకు మూడు సార్లు వాటర్ బెల్ మోగిస్తారు. ఈ సమయంలో 5 నిమిషాలు నీళ్లు తాగేందుకు బ్రేక్ ఉంటుంది. అంటే ఈ సమయంలో ప్రతి విద్యార్ధి తప్పకుండా నీళ్లు తాగేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలి.
మరోవైపు ఎండల తీవ్రతను దృష్టలో ఉంచుకుని స్కూళ్లకు వేసవి సెలవులు ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు ప్రారంభమౌతాయి. తిరిగి జూన్ 12న పాఠశాలలు తెరుచుకుంటాయి. మార్చ్ 18 నుంచి మార్చ్ 30 వరకూ ఏపీలో పదో తరగతి పరీక్షలు జరిగాయి. ప్రస్తుతం పరీక్షా పత్రాల మూల్యాంకనం జరుగుతోంది. వేసవి తీవ్రత కారణంగా ఈ ఏడాది ఒంటి పూట బడులు కూడా మార్చ్ 18నే ప్రారంభమయ్యాయి.
Also read: AP Pensions Issue: రాష్ట్రంలో రేపట్నించి పింఛన్ల పంపిణీ, కొత్త విధివిదానాలు జారీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook