AP Google AI: ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ రంగంలో అంతర్జాతీయంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఆంధ్ర ప్రదేశ్  ప్రభుత్వం కీలకమైన తొలి అడుగు వేసింది. ఏఐ రంగంలో అధునాతన ఆవిష్కరణల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గూగుల్ సంస్థ మధ్య కీలక ఒప్పందం జరిగింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆ రాష్ట్ర ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ సమక్షంలో.. గూగుల్ మ్యాప్స్ ఇండియా జనరల్ మేనేజర్ లలితా రమణి, ఎపి రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖ కార్యదర్శి సురేష్ కుమార్ నడుమ సచివాలయంలో అవగాహన ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం అంతర్జాతీయంగా ఎఐ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా.. ఆంధ్రప్రదేశ్ లోని పాఠశాలలు, కళాశాలల్లో గూగుల్ సంస్థ నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తుంది.


దీంతోపాటు స్టార్టప్ లు, సాంప్రదాయ పరిశ్రమలు, చిన్న వ్యాపార సంస్థలకు అవసరమైన.. ఎఐ ఆధారిత సేవల కోసం శిక్షణ కార్యక్రమాలను చేపడుతుంది. మరోవైపు పలు అంతర్జాతీయ సంస్థలతో ఆంధ్ర ప్రదేశ్ మరిన్ని పెట్టుబడులో కోసం కీలక అడుగులు వేసింది. ఇప్పటికే లోకేష్ విదేశాలకు వెళ్లి ఆంధ్ర ప్రదేశ్ విజన్ ను చూపిస్తూ పెట్టుబడులను ఆకర్షించే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలో పలువురు ఎన్నారైలతో పాటు ప్రవాస తెలుగు రాష్ట్రానికి చెందిన ప్రజలు ఏపీలో పెట్టుబడులో పెట్టేందుకు క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం గూగుల్ ఏఐతో కీలక ఒప్పందం చేసుకోవడం గమనార్హం.


ఇదీ చదవండి: ముగ్గురు మొనగాళ్లు సినిమాలో చిరంజీవి డూప్ గా నటించింది వీళ్లా.. ఫ్యూజలు ఎగిరిపోవడం పక్కా..


ఇదీ చదవండి:  టాలీవుడ్ లో ఎక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రాలు.. ‘పుష్ప 2’ ప్లేస్ ఎక్కడంటే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.