WhatsApp Governance: ఏపీ ప్రజలకు శుభవార్త, వాట్సప్ గవర్నెన్స్ ప్రారంభం, ఏయే సేవలంటే

WhatsApp Governance: ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు గుడ్‌న్యూస్ అందించింది. పౌర సేవలకు సంబంధించి కీలకమైన అడుగేస్తోంది. దేశంలోనే తొలిసారిగా వాట్సప్ గవర్నెన్స్ ప్రవేశపెట్టింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
WhatsApp Governance: ఏపీలో వాట్సప్ గవర్నెన్స్ వచ్చేస్తోంది. ఇవాళ అంటే జనవరి 30 నుచి ఏపీలో వాట్సప్ పరిపాలన ప్రారంభించింది. తొలిదశలో మొత్తం 16 రకాల సేవలు అందుబాటులోకి వస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెడుతున్నవాట్సప్ గవర్నెన్స్ ఇవాళ్టి నుంచి అంటే జనవరి 30 నుంచి ప్రారంభం కానుంది. మొదటి విడతలో మొత్తం 161 రకాల సేవల్ని ప్రభుత్వం తీసుకొస్తోంది. దీనికి సంబంధించిన విధి విధానాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు. తొలి దశలో దేవాదాయ శాఖ, ఏపీఎస్సార్టీసీ, రెవిన్యూ, అన్న క్యాంటీన్, సీఎంఆర్ఎఫ్, మున్సిపల్ శాఖలకు సంబంధించి మొత్తం 161 ప్రభుత్వ సేవలు ప్రజలకు వాట్సప్ ద్వారా అందనున్నాయి. ఈ సేవలకు సంబంధించి మంత్రి నారా లోకేష్ నేతృత్వంలోనే రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది అక్టోబర్ నెలలో మెటా సంస్థతో ఒప్పందం చేసుకుంది. రెండవ విడతలో మరిన్నిసేవల్ని అందుబాటులో తీసుకురానుంది.
ప్రభుత్వ సేవల్ని వాట్సప్ ద్వారా అందుబాటులో తీసుకురావడం దేశంలోనే ఇది తొలిసారి. ఇకపై వివిధ రకాల సేవలు, ధృవపత్రాల కోసం ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. అయితే పౌరుల సమాచారం సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని అధికారులకు సూచించారు చంద్రబాబు. ఫోరెన్సిక్, సైబర్ సెక్యూరిటీని పటిష్టం చేయాలని సూచించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి