Ammavodi Scheme: వైసీపీ ప్రభుత్వం అమ్మ ఒడి అనే పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది. బడులకు పంపించే తల్లులకు సొమ్ము అందిస్తోంది. ఇప్పటి వరకు మూడో విడతల్లో ప్రభుత్వం సాయాన్ని లబ్ధిదారులకు ఇచ్చింది. ఇప్పటికే తల్లుల జాబితాను భారీగా తగ్గించింది. కేవైసీ కారణంగా గతేడాదికి ఈసారికి లక్ష మంది తగ్గినట్లు తెలుస్తోంది. తాజాగా అమ్మ ఒడి లబ్ధిదారులకు భారీ షాక్‌ తగలనున్నట్లు తెలుస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అమ్మ ఒడి పథకంలో ఏపీ ప్రభుత్వం మరో కోత విధించింది. పథకంలో నగదుకు బదులుగా ల్యాప్‌ టాప్ ఇచ్చే విధానంపై యూటర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈఏడాది నుంచి 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు ఇవ్వాలని నిర్ణయించారు. బైజూస్‌తో ఒప్పందంలో భాగంగా ఇవ్వాలని ప్రభుత్వం భావించింది. ఈమేరకు సీఎం జగన్‌ సైతం నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకే ట్యాబ్‌లు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.


సెప్టెంబర్‌లో 4.7 లక్షల మంది విద్యార్థులకు దాదాపు రూ.12 వేల విలువైన ట్యాబ్‌ ఇవ్వనున్నారు. తొమ్మిది నుంచి 12వ తరగతి చదివే విద్యార్థులకు గతంలో అమ్మ ఒడికి బదులుగా ల్యాప్‌టాప్‌లు ఇస్తామని ప్రకటించారు. దీంతో 8 లక్షల 21 వేల 655 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఐతే ల్యాప్‌టాప్ ధర రూ.26 వేలు కావడంతో ప్రభుత్వం వెనుకడుగు వేసినట్లు తెలుస్తోంది. 


Also read:Chief Justice Ujjal Bhuyan: రేపే రాజ్‌భవన్‌లో కొత్త సీజే ప్రమాణస్వీకారం..సీఎం కేసీఆర్ హాజరుపై సస్పెన్స్..!


Also read:Rythu Bandhu: తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్‌..రేపే అన్నదాతల ఖాతాల్లోకి సాయం..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి