అమరావతి: సీఆర్డిఏ పరిధిలోని హ్యాపీ నెస్ట్ ప్రాజెక్ట్‌(Happy nest project)కు రివర్స్ టెండరింగ్ చేపట్టేందుకు అనుమతి ఇస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటికే రివర్స్ టెండెరింగ్ ద్వారా పలు ప్రాజెక్టులకు టెండర్లు పిలిచిన ప్రభుత్వం... తాజాగా సీఆర్డిఏ(CRDA) పరిధిలోకొచ్చే హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టుకు కూడా రివర్స్ టెండెరింగ్ చేపట్టాలని నిర్ణయించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో సీఆర్డీఏ పరిధిలోనూ రివర్స్ టెండరింగ్ సంస్కృతిని తీసుకొచ్చినట్టయింది. 


అమరావతిలోని నేలపాడు వద్ద నిర్మించతలపెట్టిన హ్యాపీ నెస్ట్ ప్రాజెక్ట్ ద్వారా 1200 ఫ్లాట్‌లు నిర్మించేందుకు సీఆర్డిఏ ప్రణాళికలు రచించిన సంగతి తెలిసిందే.