ఇకపై ఏపీ సర్కార్కు కొత్త చిహ్నం
ఇకపై ఏపీ సర్కార్కు కొత్త చిహ్నం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరించిన అనంతరం 1964 నుంచి రాష్ట్ర అధికారికంగా చిహ్నంగా కొనసాగుతున్న పూర్ణకుంభాన్ని తాజాగా ఏపీ సర్కార్ మార్చుతూ ఉత్తర్వులు జారీచేసింది. పాత చిహ్నం స్థానంలో కొత్త చిహ్నాన్ని ఆవిష్కరిస్తూ ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే కొత్త చిహ్నంలోనూ పాత చిహ్నం మాదిరిగానే మధ్యలో పూర్ణకుంభం, దానికిందనే నాలుగు సింహాలు ఉండటం గమనార్హం. పాత చిహ్నంలో పై భాగంలో ఆంగ్లంలో 'గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్' అని రాసిఉండగా, కింది భాగంలో ఎడమవైపున తెలుగులో, కుడివైపున హిందీలో ఆంధ్రప్రదేశ్ అని రాసి ఉండేది. అయితే ఈ కొత్త చిహ్నంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని చిహ్నానికి పై భాగంలో తెలుగులో కింది భాగంలో హిందీ, ఆంగ్లం భాషల్లో ఉంది. గమనించాల్సిన మరో మార్పు ఏంటంటే.. పాత అధికారిక చిహ్నంలో ‘సత్యమేవ జయతే’ అనే వాక్యం హిందీలో ఉండగా.. ఆ వాక్యాన్ని తాజాగా మాతృ భాష అయిన తెలుగులో ముద్రించారు.
రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి అధికారిక చిహ్నం మార్పు అంశం పలుసార్లు చర్చకొచ్చినప్పటికీ అది వాయిదా పడుతూ వచ్చింది. అయితే, ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 14న చిహ్నం మార్పుపై నిర్ణయం తీసుకోగలిగింది.