Road cum Runways: ఇప్పటివరకూ మీరు రోడ్ కం రైల్వే బ్రిడ్జి చూసుంటారు..హైవే కం రన్‌వే చూశారా. ఇప్పుడు అదే జరుగుతోంది. జాతీయ రహదారులు ఇకపై రన్‌వేలుగా రూపాంతరం చెందనున్నాయి. రాష్ట్రంలోని ఆ రహదారులు రన్‌వేలుగా మారనున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విమాన రాకపోకల్ని మరింత విస్తృతం చేసేందుకు, అందరికీ అందుబాటులో తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రణాళిక రచించింది. దేశంలోని కొన్ని ప్రధాన జాతీయ రహదారుల్ని రోడ్ కం రన్‌వేలుగా చేయనుంది. అంటే ఇక నుంచి ఆ రహదారులపై విమానాలు రాకపోకలు సాగిస్తాయి. అవసరమున్నచోట ల్యాండ్ అవుతాయి. దేశంలో 28 జాతీయ రహదారుల్ని ఎంపిక చేశారు. ఇందులో ఏపీకు చందిన నెల్లూరు-ఒంగోలు, ఒంగోలు-చిలకలూరిపేట రహదారులున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర రోడ్డు రవాణా శాఖమంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు.


దేశంలో చాలా ప్రాంతాల్లో 3 వందల కిలోమీటర్ల వరకూ ఎయిర్‌పోర్ట్‌లు లేవని..అందుకే విమానాలు దిగేలా ఎయిర్ స్ట్రిప్స్‌ను రోడ్డు రవాణాశాఖ ఉచితంగా నిర్మిస్తుందని నితిన్ గడ్కరీ తెలిపారు. రోడ్డు పక్కన..పౌర విమానయాన శాఖ 3-4 కోట్లతో ఎయిర్‌పోర్ట్ భవనం నిర్మిస్తే సరిపోతుందన్నారు. విమానాల రాకపోకల సమయంలో కాస్సేపు ట్రాఫిక్ నిలుపుతామన్నారు. ఈ ఎయిర్‌స్ట్రిప్స్‌పై లైటింగ్ ఉంటే..నైట్ ల్యాండింగ్ కూడా వీలవుతుందన్నారు. భవిష్యత్తులో అవసరమైన చోట మరిన్ని ఎయిర్‌స్ట్రిప్స్ నిర్మించనున్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం అమల్లోకి వస్తే..దేశంలో విమాన రాకపోకలు మరింతగా విస్తృతమౌతాయి. మరిన్ని నగరాలు లేదా పట్టణాలకు ఎయిర్ కనెక్టివిటీ పెరుగుతుంది. 


Also read: Nellore Rape Incident: నెల్లూరులో దారుణం.. పట్టపగలు అంతా చూస్తుండగానే మహిళపై రేప్..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook