అదో పెద్ద డ్రామా: విజయసాయి రెడ్డి
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, అరెస్టు భయం పట్టుకున్నప్పుడల్లా దీక్షలు, బస్సు యాత్రలు పెట్టుకుంటాడని, కార్యకర్తల మధ్యన ఉంటే తననెవరూ తాకలేరనే ధీమా అనుకుంటారేమోనని వైస్సార్సీపీకి రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు.
హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, అరెస్టు భయం పట్టుకున్నప్పుడల్లా దీక్షలు, బస్సు యాత్రలు పెట్టుకుంటాడని, కార్యకర్తల మధ్యన ఉంటే తననెవరూ తాకలేరనే ధీమా అనుకుంటారేమోనని వైస్సార్సీపీకి రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేలను చుట్టూ పెట్టుకుని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుంటాడని, చేసిన తప్పులు సామాన్యమైనవి కావని, వాటి నుండి ఎప్పటికీ తప్పించుకోలేవని మండిపడ్డారు.
మరోవైపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తమ కుటుంబసభ్యుల ఆస్తుల వివరాలు వెల్లడించడంపై ఆయన స్పందించారు. ఇది ఎప్పుడూ ఉండే రొటీన్ డ్రామానే అని వ్యాఖ్యానించారు. వాస్తవానికి ఈ తండ్రీకొడుకులే ఏపీతో పాటు దేశ పరిస్థితికి అతిపెద్ద జవాబుదారీలని పేర్కొన్నారు. వారు ఇవాళ ఆస్తులు ప్రకటించడం కొత్తేమీ కాదని, కానీ వాళ్లకు సంబంధించిన వెల్లడికాని ఆస్తులు ఎన్నో ఉన్నాయని తెలిపారు. బహిర్గతం చేయని ఆస్తులు, బినామీ ఆస్తులు, రహస్య బ్యాంకు ఖాతాలు చాలా ఉన్నా వాటిపై ఎప్పుడూ విచారణ జరగలేదని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.
జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..