Andhra Pradesh Kurnool District Devaragattu Bunny Festival 2021 Nearly 100 injured in clashes as thousands take part in Stick Fight Festival ignoring Covid guidelines: ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలోని (Kurnool District) హొళగుంద మండలం దేవరగట్టు (Devaragattu) మాళ మల్లేశ్వరస్వామి దసరా బన్ని జైత్రయాత్ర (Dussehra Bunny Jaitra Yatra) నిన్న అర్ధరాత్రి ప్రారంభమైంది. తర్వాత బన్ని ఉత్సవంలో ( Bunny Utsavam) హింస చెలరేగింది. దీంతో సుమారు వంద మందికి పైగా గాయాలయ్యాయి. వీరిలో నలుగురి పరిస్థితి చాలా విషమంగా ఉంది. క్షతగాత్రులను కర్నూలు జిల్లాలోని ఆదోని (Adoni) ఆసుపత్రికి తరలించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేవరగట్టులో సుమారు 800 అడుగుల ఎత్తైన కొండపై మాళ మల్లేశ్వరస్వామికి (Mala Malleshwaraswamy) ఏటా నిర్వహించే దసరా బన్ని ఉత్సవానికి ఎంతో ప్రత్యేకత ఉంది. బన్ని ఉత్సవం సందర్భంగా స్వామి మూర్తులను దక్కించుకోవడానికి నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామాల భక్తులు ఒక వైపు... అరికెర, అరికెరతండా, సుళువాయి, ఎల్లార్తి, కురుకుంద, బిలేహాల్, విరుపాపురం తదితర గ్రామాల భక్తులు మరోవైపు కర్రలతో తలపడతారు.


Also Read : Sabarimala Ayyappa temple reopen: నేడు తెరుచుకోనున్న శబరిమల అయ్యప్ప ఆలయం, భక్తులకు రేపటి నుంచి అనుమతి


క్షణం క్షణం ఉద్విగ్నభరితంగా సాగుతుంది దేవరగట్టు కర్రల సమరం. అయితే ఓ వర్గం వారిని మరో వర్గం అడ్డుకోవడం, ఇరు వర్గాలు కర్రలతో దాడి చేసుకోవటం వల్ల గతంలో కూడా బన్నీ ఉత్సవంలో (Bunny festival) ఎంతో మందికి తీవ్రగాయాలయ్యాయి. కరోనా (Corona0 నేపథ్యంలో ఈ ఏడాది అధికారులు చేపట్టిన చర్యలు కూడా ఫలించలేదు. 


ప్రతీ ఏడాదీ మాదిరిగానే ఈ సారి కూడా కనీసం వంద మందికి తలలు పగులుతున్నాయి. దీనిపై మానవ హక్కుల కమిషన్ (Human Rights Commission) తో పాటు లోకాయుక్త కూడా సీరియస్ అయి కర్నూలు కలెక్టర్, ఎస్పీలకు నోటీసులు జారీ చేశాయి. అధికారుల ఎదుట, ప్రభుత్వం కళ్ళెదుటే బన్ని ఉత్సవంలో (Bunny Utsavam) హింస జరుగుతున్నా.. పోలీసులు నియంత్రించలేక పోయారు అంటూ నోటీసులో ప్రశ్నించాయి.


Also Read : MS Dhoni Record: కెప్టెన్‌గా అరుదైన రికార్డు సాధించిన ఎంఎస్ ధోని


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి