AP SSC Exams Schedule 2025: ఏపీలో మార్చి 17 నుంచి ఏపీ టెన్త్ పరీక్షలు.. ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల చేసిన మంత్రి నారా లోకేష్..
Ap ssc Exams 2025: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఏపీ పదోతరగతి ఎగ్జామ్ ల షెడ్యూల్ ను విడుదల చేసినట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో విద్యార్థులకు మార్చి 17 నుంచి ఎగ్జామ్ లు స్టార్ట్ అవుతున్నట్లు సమాచారం.
AP SSC Exams Schedule 2025: సాధారణంగా విద్యార్థులు టెన్త్ ఎగ్జామ్ లను ఎంతో సీరియస్ గా తీసుకుంటారు. దీనిలో వచ్చే మార్కులతోనే ఇంటర్ లో మంచి కాలేజీల్లో సీటు దొరకడం కూడా డిపెండ్ అయి ఉంటుంది. టాప్ కాలేజీలో సీటుదొరకాలంటే.. పదో తరగతిలో మంచి మార్కులు రావాలని చెప్తుంటారు. అందుకే విద్యార్థులు టెన్త్ నుఎంతో సీరియస్ గా తీసుకుంటారు.ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఏపీ విద్యాశాఖ మంత్రి టెన్త్ ఎగ్జామ్ షెడ్యూల్ ను విడుదల చేసినట్లు తెలుస్తొంది.
మంత్రి నారాలోకేష్ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. ఆంధ్ర ప్రదేశ్ లో.. 2025 మార్చి 17వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభమై మార్చి 31న ముగియనున్నట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో.. ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పరీక్ష షెడ్యూల్‌ను ఈరోజు ( బుధవారం) విడుదల చేసినట్లు తెలుస్తొంది.
మార్చి 17న ఫస్ట్ లాంగ్వేజ్, 19న సెకండ్ లాంగ్వేజ్, మార్చి 21న ఇంగ్లీష్, 24న మ్యాథ్స్ 26న ఫిజిక్స్, మార్చి 28న బయోలజీ, 29న సోషల్ స్టడీస్ ఎగ్జామ్ లు జరగనున్నాయని తెలుస్తొంది.
Read more: AP Inter Exams: ఏపీ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల మార్చ్ 1 నుంచి 15 వరకూ ఇలా
అదే విధంగా.. ప్రస్తుతం విద్యార్థులంతా దీని కోసం సన్నద్దం అవుతున్నట్లు తెలుస్తొంది. మరోవైపు మంత్రి నారాలోకేష్.. ఏపీ ఇంటర్ షెడ్యూల్ ను సైతం విడుదల చేశారు. మార్చి 1 నుంచి 19 వరకు ఇంటర్ మొదటి సంవత్సరం, మార్చి 3 నుంచి 20 వరకు రెండో సంవత్సరం ఎగ్జామ్ లు ఉంటాయని మంత్రి నారాలోకేష్ ఒకప్రకటనలో వెల్లడించారు. అదే విధంగా ఎగ్జామ్ లు రాస్తున్న వారికి మంత్రి నారాలోకేష్ ముందస్తుగానే ఆల్ ది బెస్ట్ చెప్పినట్లు తెలుస్తొంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి