Nandamuri Balakrishna: జిమ్ లో వర్కౌట్స్ చేసిన బాలయ్య.. ఆ విషయంపై సీఎం బావకు స్పెషల్ రిక్వెస్ట్.. అసలు స్టోరీ ఏంటంటే..?
Hindupur mla balayya: హిందుపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్న క్యాంటీన్ లను ప్రారంభించారు. ఆ తర్వాత అక్కడే ఉన్న జిమ్ లో కూడా వర్కౌట్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Nandamuri Balakrishna launched Anna Canteens in Hindupur: తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హిందుపురంలో అన్న క్యాంటీన్లను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఆయన హిందుపురం ప్రజలతోమాట్లాడారు. మరల అన్నక్యాంటీన్ లు ప్రారంభించడం పట్ల ఆనందంగా ఉందన్నారు. తొందరలోనే తమ సర్కారు మరిన్ని మంచి ఫథకాలు తీసుకొస్తుందని అన్నారు. మరోవైపు హిందూపురాన్ని జిల్లా కేంద్రం చేయాలని ప్రజలు బాలయ్యను కోరారు.దీనిపట్ల సానుకూలంగా స్పందించిన బాలయ్య.. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.
హిందుపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అంటే చంద్రబాబుకు ఎంత ప్రేమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బాలయ్య.. హ్యట్రిక్ ఎమ్మెల్యేగా రికార్డు క్రియేట్ చేశారు. శుక్రవారం హిందూపురంలో పర్యటించిన బాలయ్య.. రెండు చోట్ల అన్న క్యాంటీన్లను ప్రారంభించారు. అంతేకాకుండా.. తన చేత్తో వారికి అన్నం వడ్డించి మరీ సంబర పడ్డారు. ఆ తర్వాత అక్కడి ప్రజలు.. హిందుపురం ను.. ప్రత్యేకంగా జిల్లా కేంద్రంగా చేయాలని బాలయ్యను కోరారు.దీనిపైన సీఎం చంద్రబాబుతో చర్చిస్తానని బాలయ్య హమీ ఇచ్చారు.
గత వైసీపీ సర్కారు.. పుట్టపర్తి జిల్లా కేంద్రంగా సత్యసాయి జిల్లాను ఏర్పాటు చేశారు. అయితే జిల్లా కేంద్రంగా పుట్టపర్తి వద్దని.. హిందూపురాన్ని చేయాలని హిందూపురం వాసులు కోరారు. ఇదే విషయాన్ని గతంలోనూ బాలకృష్ణ దృష్టికి సైతం తీసుకెళ్లారు. సీఎం చంద్రబాబు ఏపీని మరింత డెవలప్ మెంట్ చేసే దిశగా ముందుకు తీసుకెళ్తున్నారని బాలయ్య అన్నారు.
మరోవైపు.. ఇప్పటికే హిందుపురంలో పారిశ్రామిక క్లస్టర్లు ఏర్పాటు చేశారని, హిందూపురం అభివృద్ధి కోసం త్వరలోనే రూ.90 కోట్లు మంజూరుచేస్తారని కూడా వెల్లడించారు. రాబోయే రోజుల్లోనూ మరిన్ని నిధులు తెస్తామని కూడా పేర్కొన్నారు. ఇండిపెండెన్స్ డే రోజున బసవతారకం ఆస్పత్రిలో జెండావందనం చేసి అమ్మను స్మరించుకుంటే.. ఇవాళ అన్న క్యాంటీన్లను ప్రారంభించి నాన్న స్వర్గీయ ఎన్టీఆర్ పేరు స్మరించుకున్నానని బాలకృష్ణ ఎమోషనల్ అయ్యారు. పేదలకు మూడుపూటల అన్నం పెట్టాలనే మంచి ఉద్దేశంతోనే వంద అన్ క్యాంటీన్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి