AP New Districts: నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో అమల్లోకి రానున్న కొత్త జిల్లాలు.. సీఎం జగన్ సందేశం!
Andhra Pradesh New Districts: ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా ఏర్పడిన జిల్లాల పరిపాలన నేటి నుంచి అమలులోకి రానుంది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి జగన్ సర్కార్ తుది నోటిఫికేషన్లు జారీ చేయగా.. సోమవారం (ఏప్రిల్ 4) నుంచి కొత్త జిల్లాలు అమల్లోకి వచ్చాయి.
Andhra Pradesh New Districts: ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి 26 కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి. గతంలో 13 జిల్లాల నవ్యాంధ్ర.. ఇప్పుడు 26 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌గా మారింది. వీటిని ఖరారు చేస్తూ శనివారం అర్ధరాత్రి తర్వాత ప్రభుత్వం తుది నోటిఫికేషన్లు జారీ చేసింది. దీంతో నేటి (ఏప్రిల్ 4) నుంచి కొత్త జిల్లాలు అమల్లోకి వచ్చాయి.
పెరిగిన రెవెన్యూ డివిజన్లు
ఏపీలో 13 జిల్లాలు పెరిగిన కారణంగా.. కొత్తగా 22 రెవెన్యూ డివిజన్ల ఏర్పడ్డాయి. దీంతో మొత్తం రెవెన్యూ డివిజన్ల సంఖ్య 51 నుంచి 73కు పెరిగింది. కొత్త జిల్లాలను ప్రతిపాదిస్తూ జనవరి 25న జగన్ సర్కార్ తొలి నోటిఫికేషన్లు జారీ చేసింది. ఒక్కో లోక్‌సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అయితే విస్తీర్ణం దృష్ట్యా అరకును మాత్రం రెండు జిల్లాలుగా విభజించింది.
అభ్యంతరాలు పరిగణలోకి తీసుకొని..
కొత్త జిల్లాల ప్రతిపాదనలపై మార్చి 7వ తేదీ వరకు ప్రభుత్వం అభ్యంతరాలు, సూచనలు స్వీకరించింది. మండలాలు, డివిజన్ల మార్పులు, చేర్పులతో పాటు వాటి పేర్లపై దాదాపు 12 వేల 600 అభ్యంతరాలు వచ్చాయి. వీటిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం స్వల్ప మార్పులతో కొత్త జిల్లాలను ఖరారు చేసింది.
తిరుపతి కేంద్రంగా శ్రీబాలాజీ జిల్లాను ఏర్పాటు చేయాలని తొలుత ప్రతిపాదించారు. అయితే దీనిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఈ నేపథ్యంలో తిరుపతి జిల్లాగానే ఉంచారు. మన్యం జిల్లాకు బదులుగా పార్వతీపురం మన్యం జిల్లా పేరును ఖరారు చేశారు. కొన్ని చోట్ల మండలాల్లో స్వల్ప సవరణలు జరిగాయి. కొత్త జిల్లాలకు కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఎస్పీలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఏపీలో కొత్తగా ఏర్పడిన జిల్లాలివే!
ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లా, అనకాపల్లి, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, బాపట్ల, తిరుపతి, అన్నమయ్య, శ్రీసత్యసాయి, నంద్యాల జిల్లాలు ఏర్పాటు అయ్యాయి. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అత్యధికంగా 38 మండలాలు ఉంటే.. విశాఖలో అత్యల్పంగా 11 మండలాలు ఉన్నాయి.
ALso Read: KA Paul on RGV: ఆర్జీవీపై కోర్టుకెక్కనున్న కేఏ పాల్... లీగల్ నోటీసులు పంపిస్తానని వార్నింగ్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook