AP Liquor Shops: ఏపీ లిక్కర్ వ్యాపారంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, న్యూస్ ఛానెల్ ప్రతినిధులు
AP Liquor Shops: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కొత్త మద్యం పాలసీ ప్రకారం మద్యం దుకాణాల కేటాయింపు ముగిసింది. లాటరీ విధానం కావడంతో అదృష్టవంతులు, దురదృష్టవంతులెవరో తేలిపోయింది. అంతకుమించి మద్యం వ్యాపారంలో మంత్రులు, నేతలు, ఎమ్మెల్యేలతో పాటు న్యూస్ ఛానెల్ ప్రతినిధులు కూడా రంగంలో దిగిన పరిస్థితి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Liquor Shops: కాదేదీ వ్యాపారానికి అనర్హం..నీతులు చెప్పేటందుకే ఉంటాయి. అందుకే ఎమ్మెల్యేలు, నేతలు, మంత్రులు, మగువలతో పాటు న్యూస్ ఛానెల్ ప్రతినిధులు కూడా మద్యం వ్యాపారంలో దిగారు. కొందరికి అదృష్టం వరిస్తే కొందరికి నిరాశ మిగిలింది. ఇంకొందరికి పంట పండింది. పొరుగు రాష్ట్రం వారికి సైతం మద్యం దుకాణాలు దక్కడం విశేషం.
ఏపీలో మొన్నటి వరకూ ప్రభుత్వ హయాంలో నడిచిన మద్యం దుకాణాలు ఇప్పుడు తిరిగి ప్రైవేట్ చేతికి చిక్కాయి. లాటరీ విధానంలో రాష్ట్రంలోని మొత్తం 3,396 మద్యం దుకాణాలను వివిధ జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. ఇక రేపట్నించే రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలు తెర్చుకోనున్నాయి. మద్యం వ్యాపారంలో మగువలు కూడా పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 10 శాతం మద్యం దుకాణాలను అంటే 345 దుకాణాలు మహిళలకు దక్కాయి. 81,96,97 నెంబర్ దుకాణాలను తెలంగాణ వ్యక్తులు దక్కించుకోగా, మచిలీపట్నంలోని 1వ నెంబర్ షాపుని కర్ణాటకు చెందిన వ్యక్తి, 2వ నెంబర్ షాపుని యూపీకు చెందిన వ్యక్తి దక్కించుకోగా విజయవాడలోని 14, 18 నెంబర్ దుకాణాలను మద్యప్రదేశ్ ఇండోర్‌కు చెందిన వ్యక్తులు దక్కించుకున్నారు. ఇక శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో రెండు మద్యం షాపుల్ని ఒడిశాకు చెందిన వ్యక్తులు దక్కించుకున్నారు.
మద్యం వ్యాపారంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, న్యూస్ ఛానెల్ ప్రతినిధులు
రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మద్యం దుకాణాల కేటాయింపులో ఎమ్మెల్యేలు, నేతలు, మంత్రులు నేరుగా పాల్గొన్నారు. అనంతపురం జిల్లా బీజేపీ అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసరావుకు ధర్మవరం నియోజకవర్గ పరిధిలోని ధర్మవరం, బత్తలపల్లి, ముదిగుబ్బ ప్రాంతాల్లో 5 మద్యం దుకాణాలు దక్కాయి. ఇక మంత్రి నారాయణ స్వయంగా2 కోట్ల రూపాయలు వెచ్చించి 100 దుకాణాలకు దరఖాస్తులు వేశారు. కానీ లాటరీలో 3 షాపులు దక్కాయి.
ఇక బీఆర్‌కే న్యూస్ ఛానెల్ యాజమాన్యం తన సిబ్బందితో రాష్ట్రవ్యాప్తంగా 350 మద్యం దుకాణాలకు దరఖాస్తులు వేయించగా వైఎస్సార్ జిల్లా కమలాపురంలో 4 మద్యం షాపులు దక్కాయి. అయితే ఈ షాపులకై కన్నేసిన ఓ వర్గం బీఆర్కే న్యూస్ ఛానెల్ ప్రతినిధిని, కెమేరా మెన్‌ను కిడ్నాప్ చేసినట్టు సమాచారం. అధికారికంగా ఎవరూ ఫిర్యాదు చేయలేదు.
Also read: AP Rains: ఏపీకి తుపాను ముప్పు.. వాయుగుండం అల్పపీడనం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.