Andhra Pradesh News: ఆంధ్రప్రదేశ్ లో ముందస్తు ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చని జోస్యం చెప్పారు ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలపై ప్రచారం జరుగుతోందని.. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్దంగా ఉన్నామని చంద్రబాబు అన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పొత్తులపై వస్తున్న ఊహజనిత వార్తలపై తామిప్పడే స్పందిచమని చెప్పారు. కరోనా కారణంగా జనం రోడ్డెక్కలేదని.. అందుకే జగన్ బతికిపోయారని అన్నారు. 175 నియోజకవర్గాలతో సమావేశమై ప్రజా ఉద్యమాలను తీవ్రతరం చేస్తామన్నారు.


 


ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం


రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరుగుతోందని.. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని అంచనా వేయలేకపోతున్నామని ఆయన మండిపడ్డారు. అనేకమంది సీఎంలుగా పని చేసినా.. జగన్ లాగ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసిన వారు ఎవరూ లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. 


ఏపీ రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్​ను సీఎం జగన్ దెబ్బ తీశారని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. పారిశ్రామిక వేత్తలు మొదలుకుని.. రోజూ కూలీ వరకు పొరుగు రాష్ట్రాలకు వలస పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అరాచకాలను ప్రస్తుతం ప్రజలు భరిస్తున్నారని.. ఎన్నికల్లో అన్ని తేలుస్తారని ఆయన స్పష్టం చేశారు. 


Also Read: Pension Kanuka Hike: జనవరి 1 నుంచే పెన్షన్​ కానుక పెంపు అమలు!


Also Read: Chandrababu Naidu: రాధా హత్యకు కుట్రపై విచారణ జరిపించండి.. డీజీపికి చంద్రబాబు లేఖ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి