Andhra Pradesh Police arrested TDP spokesperson Pattabhi Ram Kommareddy : తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ రోజు మధ్యాహ్నం నుంచి పట్టాభి (Pattabhi) నివాసం వద్దకు భారీగా పోలీసులు తరలివచ్చారు. సరిగ్గా రాత్రి 9 గంటల సమయంలో పట్టాభిని అరెస్టు చేశారు. అయితే పట్టాభి ఇంటి కాలింగ్‌ బెల్‌కొట్టినా.. ఆయన తలుపు తీయలేదని అందుకే బలవంతంగా అరెస్టు చేయాల్సి వచ్చిందని పోలీసులు (Police) చెబుతున్నారు. అయితే తన భర్తకు ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యతని పట్టాభి భార్య కొమ్మారెడ్డి చందన (Kommareddy Chandana) అన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read : YSRCP Janagraha Deeksha : రేపటి నుంచి వైఎస్సార్‌సీపీ జనాగ్రహ దీక్షలు


ఏపీ సీఎం వైఎస్ (CM YS Jagan) జగన్‌పై పట్టాభి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో.. వైఎస్సార్సీపీ (YSRCP) శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగారు. అలాగే నిన్న టీడీపీ కార్యాలయాలపై దాడులకు పాల్పడ్డారు. ఇక సీఎం జగన్‌పై పట్టాభి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వైఎస్సార్సీపీ ఫిర్యాదు మేరకు విజయవాడ గవర్నర్‌పేట పోలీస్‌ స్టేషన్‌లో పట్టాభిపై కేసు నమోదైంది. అరెస్టు అనంతరం పట్టాభిని గవర్నర్‌ పేట పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.


Also Read : Nara lokesh: పోలీసు అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు ‌: లోకేశ్‌


ఇక అంతకుముందు ఆయనకు పోలీసులు 41 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చారు. రాజ్యాంగ బద్ధ పదవుల్లో ఉన్న వారి పట్ల పట్టాభి అనుచిత వ్యాఖ్యలు చేశారు... రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించారంటూ పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. ఐపీసీ సెక్షన్లు 153 (ఏ), 505(2), 504 (ఆర్‌/డబ్ల్యూ), 120 (బి) కింది పట్టాభిపై (Pattabhi) కేసులు నమోదు చేశారు.


Also Read : Kodali Nani : వ్యూహం ప్రకారమే డ్రగ్స్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారు : కొడాలి నాని


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి