Road Accident at Chittoor district : అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ( Andhra pradesh ) చిత్తూరు జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ రోడ్డు ప్రమాదం ( Road Accident ) లో ద్విచక్రవాహనదారుడు.. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మరణించగా..ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. చెన్నై, బెంగుళూరు జాతీయ రహదారిపై చిత్తురు జిల్లా బంగారుపాళెం తగ్గువారిపల్లెకు చెందిన బాబు పలమనేరు నుంచి చిత్తూరు వైపు ద్విచక్రవాహనంపై వెళ్తున్నాడు. ఈ క్రమంలో రోడ్డు క్రాస్ చేస్తుండగా.. వెనుక నుంచి వస్తున్న కారు అదుపుతప్పి ద్విచక్రవాహనాన్ని బలంగా ఢికొని... అనంతరం ఆగిఉన్న లారీని ఢికొట్టింది. కారు బలంగా ఢికొట్టడంతో బాబు (45) అక్కడికక్కడే మరణించాడు. దీంతోపాటు కారు లారీని ఢికొనడంతో దానిలో ప్రయాణిస్తున్న వెంకటేశ్వర్లు (29), అమ్మ రత్నమ్మ (49) తండ్రి శ్రీనివాసులు (55) మరణించారు. వారితోపాటు కారులో ఉన్న శిరీషకు తీవ్ర గాయాలయ్యాయి. Also read: Most Desirable Women: అగ్రస్థానంలో నిలిచిన దిశా పటాని


సమాచారం అందుకున్న పోలీసులు (AP Police)  సంఘటన స్థలానికి చేరుకోని మృతదేహాలను బంగారుపాళెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. అయితే చనిపోయిన వారంతా బెంగళూరు నుంచి తమ సొంత గ్రామం నెల్లూరుకు వెళ్తున్నట్లు సమాచారం. సైట్ విషయంపై మాట్లాడేందుకు బెంగళూరు నుంచి నెల్లూరుకు వెంకటేశ్వర్లు కుటుంబం వెళ్తుండగా.. ఈ ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు.   Apsara Rani: స్విమ్ డ్రెస్‌లో రెచ్చిపోయిన అప్సర    Also read: Seerat Kapoor: పిచ్చెక్కిస్తున్న సీరత్ కపూర్ సోయగాలు