Heavy Rains Alert: దక్షణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఎటు మళ్లుతుందో అంచనాలకు అందడం లేదు.  మరో రెండు రోజుల్లో ఇది మరింతగా బలపడి వాయగుండంగా మారనుందని ఐఎండీ వెల్లడించింది. ఫలితంగా కోస్తాంధ్ర జిల్లాల్లో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు పడనున్నాయి. ప్రస్తుతానికి ఈ అల్పపీడనం నెల్లూరు ఉత్తర తమిళనాడు మధ్యలో విస్తరించి ఉంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి భారీ వర్షసూచన జారీ అయింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరో రెండు రోజుల్లో వాయుగుండంగా బలపడనుంది. ఫలితంగా ఈ నెల 18 నుంచి కోస్తాంధ్ర తీరంలోని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. ఈ నెల 22 వరకూ కోస్తాంధ్రలో వర్షాల హెచ్చరిక ఉంది. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా, ఉత్తరాంధ్రలో కొన్ని చోట్ల భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతానికి వాయువ్య దిశగా కదులుతోంది. వాయుగుండంగా మారిన తరువాత అటు తమిళనాడు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. ముఖ్యంగా చెన్నై తీర ప్రాంతాల్లో అతి భారీ వర్షం నమోదు కావచ్చని ఐఎండీ తెలిపింది. ఇవాళ కూడా నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు పడనున్నాయి. అల్పపీడనం ప్రభావంతో ఎల్లుండి గురువారం వరకు బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. గంటకు 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. 


Also read: AP Holidays: ఏపీ అధికారిక సెలవుల జాబితా విడుదల, మొత్తం 23 రోజులు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.