AP TET Exams 2024: ఏపీ టెట్ పరీక్షలకు రాష్ట్ర విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. త్వరలో జరగనున్న డీఎస్సీలో టెట్ అర్హత, టెట్ మార్కుల వెయిటేజ్ ఉండటంతో ప్రాధాన్యత పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల 67 వేల 559 మంది టెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

AP TET Exams 2024కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా  120 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు కాగా పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, ఒడిశాలలో సైతం పరీక్ష కేంద్రాలు ఏర్పాటయ్యాయి. తెలంగాణలో మూడు, కర్ణాటకలో నాలుగు, తమిళనాడులో 2, ఒడిశాలో 2 పరీక్షా కేంద్రాలున్నాయి. ఏపీ టెట్ పరీక్షలు రెండు సెషన్లలో మార్చ్ 6 వరకూ జరుగుతాయి. ఉదయం 9.30 గంటల్నించి మద్యాహ్నం 12 గంటల వరకూ ఒక సెషన్ కాగా, రెండవ సెషన్ మద్యాహ్నం 2.30 గంటల్నించి సాయంత్రం 5 గంటల వరకూ ఉంటుంది. పరీక్షా సమయానికి అరగంట ముందు అభ్యర్ధులు పరీక్ష కేంద్రానికి చేరుకోవల్సి ఉంటుంది.


ఏపీ టెట్ పరీక్ష పూర్తిగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష. మొత్తం 26 మంది సీనియర్ అదికారుల పర్యవేక్షణలో 29 ఫ్లైయింగ్ స్క్వాడ్ ల పరిశీలనలో పరీక్షలు జరుగుతాయి. ఏపీ టెట్ 2024 ప్రైమరీ కీ మార్చ్ 10వ తేదీన విడుదల కానుంది. ఫలితాలు మార్చ్ 14న వెల్లడి కానున్నాయి.


ఏపీ టెట్ పరీక్షల టైమ్ టేబుల్


పేపర్ 1ఎ ఇవాళ్టి నుంచి మార్చ్ 1 వరకూ 
పేపర్ 2ఎ మార్చ్ 2 నుంచి మార్చ్ 4 వరకూ తిరిగి మార్చ్ 6వ తేదీన
పేపర్ 1బి మార్చ్ 5వ తేదీన
పేపర్ 2బి మార్చ్ 5వ తేదీ మద్యాహ్నం


గర్భిణీ మహిళలకు సమీప కేంద్రాల్లో పరీక్ష రాసేందుకు వెసులుబాటు కల్పించారు. దీనికోసం సదరు మహిళా అభ్యర్ధులు సమీపంలోని పరీక్షా కేంద్రానికి వెళ్లి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. అభ్యర్ధుల సౌకర్యార్ధం పరీక్షా కేంద్రాల్లో ప్రాధమిక వైద్యం, డ్రింకింగ్ వాటర్, టాయిలెట్స్ సౌకర్యాలు ఏర్పాటయ్యాయి. 


Also read: AP Politics: గుంటూరు పార్లమెంట్ బరిలో మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook