AP TET 2024 Results: ఏపీ టెట్ పరీక్ష ఫలితాలు మార్చ్ 14న, ఇలా చెక్ చేసుకోండి
AP TET 2024 Results: డీఎస్సీ, టెట్ పరీక్షలు రాసిన అభ్యర్ధులకు ముఖ్య గమనిక. ఆంధ్రప్రదేశ్ టెట్ 2024 పరీక్షలు మార్చ్ 14న విడుదల కానున్నాయి. ఏపీ విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్ https://aptet.apcfss.in/లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP TET 2024 Results: AP TET 2024 పరీక్షా ఫలితాలు మరో రెండ్రోజుల్లో మార్చ్ 14వ తేదీన విడుదల కానున్నాయి. రాష్ట్రంలో టెట్ పరీక్షలు మార్చ్ 9న జరగగా ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఇప్పటికే టెట్ పరీక్ష రెస్పాన్ షీట్లు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెట్, డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ రోజుల వ్యవధిలో ఒకేసారి విడుదల చేసింది. టెట్, డీఎస్సీ పరీక్షల మధ్య కనీసం 4 వారాల గడువు ఉండాలన్న ఏపీ హైకోర్టు ఆదేశాల నేపద్యంలో ప్రభుత్వం డీఎస్సీ పరీక్షల తేదీని మార్చ్ 30కు వాయిదా వేసింది. ఇక టెట్ పరీక్షలు మాత్రం యధావిధింగా షెడ్యూల్ ప్రకారం మార్చ్ 9వ తేదీన జరిగాయి. ఆ తరువాత ప్రిలిమినరీ కీ విడుదలైంది. అభ్యంతరాలు స్వీకరించిన తరువాత మార్చ్ 13 వతేదీన ఫైనల్ కీ విడుదలవుతుంది. 14వ తేదీన షెడ్యూల్ ప్రకారం ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఏపీ డీఎస్సీలో టెట్ పరీక్షల మార్కులకు 20 శాతం వెయిటేజ్ ఉండటంతో టెట్ పరీక్ష ఫలితాల కోసం ఆసక్తి పెరిగింది.
ఏపీ టెట్ పరీక్ష 2024కు హాజరైన అభ్యర్ధుల రెస్పాన్ షీట్లు ఇప్పటికే అధికారిక వెబ్‌సైట్ https://aptet.apcfss.in/ లో అందుబాటులో ఉన్నాయి. యూజర్ ఐడీ, పుట్టిన తేదీ వివరాలతో వీటిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మరోవైపు మార్చ్ 30 నుంచి ఏపీ డీఎస్సీ పరీక్షలు జరగనున్నాయి. మార్చ్ 20 నుంచి పరీక్షా కేంద్రాల ఎంపికకు సంబంధించి వెబ్ ఆప్షన్ ప్రక్రియ ప్రారంభమౌతుంది మార్చ్ 25వ తేదీన డీస్సీ హాల్ టికెట్లు విడుదల కానున్నాయి.
Also read: Siddham Meeting: మీరు కృష్ణుడు.. నేను అర్జునుడిని.. కురుక్షేత్రానికి సిద్ధమా?: వైఎస్ జగన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook