MLC Elections scheduled: తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల నగారా మోగింది. ఈ రెండు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రంలో రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ రిలీజైంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరోవైపు ఆంధ్ర ప్రదేశ్ లో రెండు పట్టభద్రుల, ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి షెడ్యూల్ ను ఖరారు చేశారు. ఫిబ్రవరి 3 ఈ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి సంబంధించి నోటీఫికేషన్ విడుదల చేయనున్నారు. ఫిబ్రవరి 2న పోలింగ్ నిర్వహించనున్నారు. మార్చి 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. షెడ్యూల్ విడుదలతో ఎన్నికలు జరుగుతున్న ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల ప్రవర్తనా నియామావళి అమల్లోకి రానుంది. దీంతో తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు తమ వ్యూహాలను పదనుపెట్టే పనిలో పడ్డాయి. మరోవైపు ఏపీలో కూటమి వర్సెస్ వైసీపీ మధ్య పోటీ ఉండనుంది. అయితే ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయలేనంటూ చేతులెత్తేసిన చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానికి ఇది తొలి పరీక్ష అని చెప్పాలి.


ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..


ఇక తెలుగు రాష్ట్రాలు కాకుండా.. వచ్చే నెల 5న ఢిల్లీ అసెంబ్లికి ఎన్నికలు జరగనున్నాయి. గత మూడు పర్యాయాలు అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి, భారతీయ జనతా పార్టీకి మధ్య గట్టి పోటీ నెలకొంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఏ మేరకు పోటీ ఇస్తుందనేది చూడాలి. ఈ ఎన్నికల సంబంధించిన ఫిబ్రవరి 8న ఎన్నికల ఫలితాలను ప్రకటించనున్నారు. ఇక 1993 తర్వాత ఢిల్లీ పీఠం కోసం బీజేపీ ఎదురుచూస్తోంది. మరి ఈ సారి అయినా.. భారతీయ జనతా పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీని ఢీ కొట్టి హస్తిన పీఠం దక్కించుకుంటుందా అనేది చూడాలి.


ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?


ఇదీ చదవండి:   గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.