AP TET & DSC Exams: ఆంధ్రప్రదేశ్‌లో టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2024, డీఎస్సీ 2024 విషయంలో సందిగ్దత ఏర్పడింది. టెట్ ఫలితాలు విడుదలై డీఎస్సీ పరీక్షల హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవల్సిన సమయం వచ్చేసినా ఎన్నికల కోడ్ కారణంగా ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ రెండింటికీ అనుమతి ఇవ్వాల్సిందిగా ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎన్నికల కోడ్ అమల్లోకి రాగానే పరిపాలనకు సంబంధించిన కీలక నిర్ణయాల్లో ఎన్నికల సంఘం అనుమతి తీసుకోవాలనే ఆదేశాలు జారీ అయ్యాయి. ముఖ్యంగా డీఎస్సీ పరీక్షల నిర్వహణ, ఏపీ టెట్ ఫలితాల విడుదలకు ఈసీ అనుమతి ఉండాలని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనా స్పష్టం చేశారు. వాస్తవానికి మార్చ్ 20 ఏపీ టెట్ పరీక్ష 2024 ఫలితాలు వెల్లడి కావల్సి ఉంది. అదే రోజు నుంచి కొత్త షెడ్యూల్ ప్రకారం డీఎస్సీ పరీక్షా కేంద్రాల ఎంపిక జరగాల్సి ఉంది. మార్చ్ 25వ తేదీన హాల్ టికెట్ల డౌన్‌లోడ్, మార్చ్ 30 నుంచి ఏప్రిల్ 3 వరకూ పరీక్షలు జరగాల్సి ఉన్నాయి. ఇక టెట్ పరీక్షలు ఫిబ్రవరి 27 నుంచి మార్చ్ 5 వరకూ పూర్తయ్యాయి.


ఎన్నికల కోడ్ కారణంగా టెట్ పరీక్ష ఫలితాల విడుదల, డీఎస్సీ పరీక్షల నిర్వహణపై సందిగ్దత నెలకొంది. ఈ క్రమంలో ఈ రెండింటికీ అనుమతి కోరుతూ పాఠశాల విద్యాశాఖ కమీషనర్ ఎన్నికల ప్రధానాధికారికి లేఖ రాశారు. ఎన్నికల సంఘం నుంచి అనుమతి రాగానే ఏపీ టెట్ 2024 ఫలితాలు విడుదల చేస్తామన్నారు. అంతేకాకుండా డీఎస్సీ పరీక్ష కేంద్రాల ఎంపిక, హాల్ టికెట్ల డౌన్‌లోడ్ సదుపాయం అందుబాటులో తెస్తామన్నారు. 


Also read: VIVO Foldable Phones: వివో నుంచి అత్యంత సన్నని, శక్తివంతమైన ఫోల్డబుల్ ఫోన్లు, ఫీచర్లు ఇవీ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook