ఫిబ్రవరి 10వ తేదీన ఏపీ టెట్ ( టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ) హాల్ టికెట్స్‌ని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తాం అని ఇటీవల ప్రకటించిన ఏపీ విద్యా శాఖ అన్నట్టుగానే శనివారం హాల్ టికెట్స్ వివరాలని అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే, ప్రస్తుతానికి టెట్ పేపర్-3 హాల్ టికెట్లు మాత్రమే విద్యాశాఖ వెబ్‌సైట్‌లో అందుబాటులో వుండగా మిగతా పేపర్‌ 1, 2 హాల్‌టికెట్లను ఆదివారం నుంచి అందుబాటులో తీసుకురానున్నట్టు విద్యాశాఖ కమిషనర్‌ సంధ్యారాణి తెలిపారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీ టెట్ హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి http://aptetht1837526.apcfss.in/SearchaptetHT180816830.htm


ఏపీ టెట్ పేపర్ 1, 2, 3 లకు కలిపి మొత్తం 4,46,833 మంది దరఖాస్తు చేసుకోగా వారిలో 20 శాతం కోటా కింద దరఖాస్తు చేసుకున్న తెలంగాణ అభ్యర్థులు కూడా వున్నారని తెలుస్తోంది. ఇదిలావుంటే, ఏపి విద్యా శాఖ ఫిబ్రవరి 21 నుంచి మార్చి 3వ తేదీ వరకు ఏపీ టెట్ పరీక్షల షెడ్యూలు ఖరారు చేసిన సంగతి తెలిసిందే.