బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. ఆంధ్రాకు వర్ష సూచన!
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. ఆంధ్రాకు వర్ష సూచన!
విశాఖపట్నం: నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో చెదురుముదురు జల్లులు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి 3.6 కి.మీటర్ల ఎత్తులో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా ఈ జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాయలసీమ, కోస్తాంధ్రలోనూ అక్కడక్కడా ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం లేకపోలేదని విశాఖ వాతావరణ శాఖ అధికారులు స్పష్టంచేశారు.