Heavy Rains: ఏపీలోని ఈ జిల్లాల్లో మరో మూడు రోజులు భారీ వర్షాలు, బయటకు రావద్దు
Heavy Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలహీనపడినా వర్షాలు మాత్రం తప్పేట్టు లేవు. అస్తవ్యస్థంగా ఉన్న తీవ్ర అల్పపీడనం కారణంగా మరో మూడు రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Heavy Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర అల్పపీడనంగా బలహీనపడింది. కానీ పశ్చిమ గాలుల ప్రభావం అధికంగా కన్పిస్తోంది. దాంతో ఏపీలో మరోసారి మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. ముఖ్యంగా నాలుగు జిల్లాల్లో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు పడనున్నాయి.
వరుస అల్పపీడనాలతో భారీ వర్షాలు ఏపీని వీడటం లేదు. ఈసారి దక్షిణ కోస్తా టార్గెట్‌గా భారీ వర్షాలు దంచి కొట్టాయి. తాజాగా ఏర్పడిన వాయుగుండం ఇప్పుడు కాస్త బలహీనపడింది. తుపాను ముప్పు ఏపీకు తప్పింది. కానీ పశ్చిమ గాలుల ప్రభావంతో పరిస్థితి అంచనా వేయడం కష్టమౌతోంది. దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో , ఇతర ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయని ఐఎండీ వెల్లడించింది. ముఖ్యంగా ఇవాళ్టి నుంచి గురువారం వరకు అంటే రానున్న మూడ్రోజులు నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. గంటకు 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అందుకే సముద్రంలో వేటకు వెళ్లవద్దని మత్స్యకారులను హెచ్చరించారు.
వాస్తవానికి నిన్నటికి ఈ అల్పపీడనం పూర్తిగా బలహీనపడాల్సి ఉంది. అల్పపీడన ప్రయాణం అంచనాకు తగ్గట్టు లేదు. దీనికితోడు పశ్చిమ గాలుల ప్రభావం. అందుకే అల్పపీడనం తీరం దాటేది కూడా అంచనా వేయలేకున్నారు. ఫలితంగా రానున్న మూడు రోజులు భారీ వర్షాలు తప్పేట్టు లేవు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.