AP Rain Fall: భారీ వర్షాలు ఇప్పట్లో వీడేలా కన్పించడం లేదు. బంగాళాఖాతంలో ఈనెల 5న ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు మొదలయ్యాయి. నిన్న రాత్రి నుంచి కొన్ని ప్రాంతాల్లో ఏకధాటిగా వర్షం కురుస్తోంది. ముఖ్యంగా వరద ప్రభావిత విజయవాడలో రాత్రి నుంచి మరోసారి వర్షం పడుతుండటంతో పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బంగాళాఖాతంలో రేపు అంటే సెప్టెంబర్ 5న అల్పపీడనం ఏర్పడనుంది. ఇది కాస్తా తుపానుగా మారే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ ప్రభావంతో ఇప్పటికే ఏపీలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా వరద ప్రభావిత విజయవాడ, జగ్గయ్యపేట, పెనుగంచి ప్రోలు, నందిగామ, కంచికచర్ల, తిరువూరు, మైలవరం, ఇబ్రహీం పట్నం ప్రాంతాల్లో రాత్రి నుంచి భారీ వర్షం పడుతోంది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం వరకూ భారీ వర్షం కురిసింది. ఇప్పటికే వరద మంపులో ఉన్న విజయవాడ ప్రాంతంలో మరోసారి భారీ వర్షాలు పడటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. 


మరోవైపు తూర్పు గోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో ఉదయం నుంచి భారీ వర్షం పడుతోంది. తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఏపీలో నిన్న రాత్రి 8.30 గంటల నుంచి ఇవాళ ఉదయం 7 గంటల వరకు వివిధ ప్రాంతాల్లో కురిసిన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. 


నెల్లూరు జిల్లా ఉతుకూరులో 85 మిల్లీమీటర్లు
తిరుపతి జిల్లా అల్లంపాడులో 80.5 మిల్లీమీటర్లు
ఎన్టీఆర్ జిల్లా చండ్రాలలో  76.5 మిల్లీమీటర్లు
తిరుపతి జిల్లా చింతవరంలో 69.75 మిల్లీమీటర్లు
నెల్లూరు జిల్లా కొలనుకుదురులో  61.5 మిల్లీమీటర్లు
నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో 53 మిల్లీమీటర్లు
తిరుపతి జిల్లా చిట్టేడులో 51 మిల్లీమీటర్లు
కోనసీమ జిల్లా అల్లవరంలో  49.25 మిల్లీమీటర్లు


Also read: Telangana Rain Alert: తెలంగాణలో భారీ వర్షాలు, ఖమ్మంలో మళ్లీ అతి భారీ వర్షాల హెచ్చరి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.