Heavy Rains Alert: భారీ వర్షాలతో అల్లాడిన ఏపీ,తెలంగాణ రాష్ట్రాల్లో గత కొద్దిరోజులుగా ఉక్కపోత పెరుగుతోంది. పగటి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటోంది. ఇప్పుడు తిరిగి భారీ వర్షాల హెచ్చరిక జారీ అయింది. వచ్చే నాలుగు రోజులు ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయని ఐఎండీ తెలిపింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పశ్చిమ బంగాళాఖాతంలో ఆగ్నేయంగా వాయుగుండం కొనసాగుతోంది.  గాలులు పశ్చిమ వాయువ్య దిశల నుంచి వీస్తున్నాయి. దాంతో రానున్న 3-4 రోజుల్లో ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడవచ్చు. ముఖ్యంగా ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు పడనున్నాయి. వాయుగుండం కారణంగా రాష్ట్రంలోని ఎన్టీఆర్, ఏలూరు, పశ్చిమ గోదావరి, కాకినాడ, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, పార్వతీపురం మన్యం , విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి జిల్లాల్లో  భారీ వర్షాలు పడనున్నాయి. ఇతర ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడవచ్చు. అంతేకాకుండా తీరప్రాంతం వెంబడి గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయి. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. 


ఇక తెలంగాణలో రానున్న మూడు రోజుల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చు. ఇవాళ, రేపు కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్ష సూచన తప్ప మిగిలిన జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం లేదు. 


Also read: UPI Cash Deposit: నగదు డిపాజిట్‌కు బ్యాంకుకు వెళ్లాల్సిన పని లేదు. యూపీఐ ద్వారా క్యాష్ జమ చేయొచ్చు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.