AP Summer Effect: మండుతున్న ఎండాకాలం, భయపెడుతున్న రాత్రి ఉష్ణోగ్రతలు
AP Summer Effect: ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం రోజురోజుకూ వేడెక్కుతోంది. పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో మరో రెండ్రోజులు ఇదే పరిస్థితి కొనసాగవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Summer Effect: ఏపీలో ఎండాకాలం మండుతోంది. మే నెల రాకముందే పగటి ఉష్ణోగ్రతలు పీక్స్‌కు చేరుతున్నాయి. ఏప్రిల్ నెలలోనే గరిష్టంగా 46 డిగ్రీల వరకూ నమోదవుతున్నాయి. రాత్రి వేళ కూడా ఉష్ణోగ్రత పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లో ఓ వారం రోజుల్నించి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రానున్న 3-4 రోజుల్లో ఎండలు మరింతగా పెరగవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. ఏప్రిల్ నెలలో కనిష్ఠ ఉష్ణోగ్రత అంటే రాత్రివేళ 25-27 డిగ్రీలుంటే ఇప్పుడు అందుకు భిన్నంగా 33 డిగ్రీల వరకూ నమోదవుతోంది. మే నెల వచ్చేసరికి పరిస్థితి మరింత జటిలం కావచ్చని అంచనా వేస్తున్నారు. పగటి ఉష్ణోగ్రతలు ఏప్రిల్ నెలలో సాధారణంగా 41 డిగ్రీలుంటుంది. కానీ ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా 46 డిగ్రీలకు చేరుకుంటోంది.
ఈసారి రాత్రి పూట ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతుండటంతో జనం బెంబేలెత్తుుతన్నారు. తీవ్రమైన ఉక్కపోతతో నిద్రపట్టక సతమతమవుతున్నారు. రానున్న రోజుల్లో రాత్రి ఉష్ణోగ్రత మరింత పెరగవచ్చని అంచనా. మరోవైపు తీవ్రమైన వడగాల్పులు భయపెడుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4-6 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. నిన్న శుక్రవారం పార్వతీపురం మన్యం జిల్లాలో అత్యధికంగా 45.7 డిగ్రీల ఉష్ణోగ్రత, కడప జిల్లా సింహాద్రిపురంలో 45.6 డిగ్రీలు, నంద్యాల జిల్లా బనగానపల్లెలో 45.5 డిగ్రీలు, విజయనగరం జిల్లాలో రాంభద్రపురం 44.9 డిగ్రీలు నమోదయ్యాయి.
శుక్రవారం నాడు 61 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 117 మండలాల్లో వడగాల్పులు వీచాయి. ఇవాళ, రేపు కూడా రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర వడగాలులు వీయవచ్చని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది. ఈ నేపధ్యంలో వృద్ధులు, చిన్నారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. శరీరం డీ హైడ్రేట్ కాకుండా ఉండేందుకు నీరు ఎక్కువగా తాగాలంటున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook